ఆయన మాట్లాడితే వృద్ధులు, మధ్యవయస్కులు, యువతీయువకులు మైమరచిపోయి వొళ్ళంతా చెవులు చేసుకొని వింటారు. ఆయన పద్యంచదివితే శ్రవణాలలో అమృతధార కురిసినట్టు ఉంటుంది. సనాతనధర్మం గురించి అలవోకగా చెబుతుంటే, ఆయన మాట తడబడగా విన్నవాళ్ళు లేరు. గుడిలోనో, బడిలోనో, సభలోనో మాట్లాడితే ప్రాంగణంఅంతా కిక్కిరిసిపోతుంది. టీవీలో మాట్లాడితే ఆచానల్ టీఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగిపోతుంది. జనాలకి బయట ఎన్నిపనులున్నా ముగించుకొని టీవీలో ప్రవచనం వచ్చేసమయానికి ఆఘమేఘాలమీద ఇంటికిచేరిపోయి, మనసునిండా ఆర్యధర్మాన్ని నింపుకొనేలా చెయ్యగల మహిమ ఆయన మాటలకే ఉంది. `కేవలం మాటకి మనుషులు మారతారా?` అంటే - `ఆయన చెపితే మారతారు` అంటారు. రామాయణం, భారతం, భాగవతం, అష్టాదశపురాణాలు, గురుచరిత్రలు, స్తోత్రాలు... ఆయనకి కొట్టినపిండి. సముద్రంలోకి దూకి అడుగున ఎక్కడో దాక్కొనిఉన్న రత్నాలని వెలికితీసే సీడైవర్ లాగ ఋషులచే చెప్పబడిన వాంజ్మయంలో విలువలని లలతమైన తెలుగుభాషలో వివరించి చెప్పడం ఆయన పని. ఇప్పటికే ఆయనేవరో ఊహించిఉంటారు. మీఊహ నిజమే. ఆయనే శారదాజ్ఞానపుత్ర, ఉపన్యాసచక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావుగారు.
ధర్మం అంటే చెప్పడం కాదు, ఆచరించడం అంటారు ఆయన. దానికి ఉదాహరణగా రాముడినీ, రావణుడిని చూపిస్తారు. ఇద్దరికీ ధర్మంతెలుసు. రాముడు ఆచరించి ఆదర్శప్రాయుడయితే, రావణుడు ఆచరించక అదోగతిపాలయ్యాడు. వ్యక్తిత్వవికాస క్లాసుల్లో చెప్పేదికూడా అదే. మనుష్యులతో మంచి సంబంధబాంధవ్యాలు నెరిపితే మంచి విజయం సొంతమవుతుంది అని. మంచిబిడ్డగా, మంచిశిష్యుడు/రాలుగా, మంచిజీవితభాగస్వామిగా, మంచితల్లి/తండ్రిగా, సమాజంలో ఆదర్శప్రాయుడైన మంచిపౌరుడిగా ఉండాలని. శ్రీరాముడు ఆచరించి చూపింది అదేకదా? ఇంగ్లీష్ చదువుల్లో పడి మనకి ఇలియడ్ తెలిసినంతగా రామాయణం తెలియడంలేదు. `ఈ ఇతిహాసపు గొప్పతనం ఇదీ,` అని చాగంటి వారు చెప్పినట్టు చెపితే ఇప్పటితరం దాన్ని మక్కువతో అక్కున చేర్చుకోకుండా ఉంటుందా? గజేంద్రమోక్షంగురించో, గంగావతరణంగురించో, శివతాండవంగురించో వర్ణించి చెపుతుంటే శ్రోతలకి వొళ్ళుగగ్గుర్పాటు చెంది, పురాణాలు పాతచింతకాయ పచ్చడి కాదనే అవగాహన పెరగదూ?
అరిషడ్వర్గాలనీ ఉత్తేజింపచెయ్యగల సాహిత్యం, సినిమాలు, అంతర్జాలంలో వీడియోలు అందుబాటులో ఉన్నంతగా మంచిని చెప్పగల గురువులు అందుబాటులో లేరు అంటారు ఆయన. అందుకే గురువుల అవసరం నేటికాలంలో చాలా ఉంది, అప్పుడే ప్రజలలో నేరప్రవృత్తి తగ్గుతుంది అని నొక్కి వొక్కాణిస్తారు. అందుకే తనవంతుగా విస్తృతంగా ధర్మప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఆయన చేసిన ఉపన్యాసాలనన్నింటినీ పుస్తకరూపంలో చేరిస్తే 2,400 పేజీలవుతుందట. వింటే 1,200 గంటలపాటు వినాలి. ఉపన్యాసంచెప్పినందుకు ప్రతిఫలంగా ఒక్కరూపాయికూడా తీసుకోరట!
చాగంటివారిది కాకినాడ. ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం. తల్లితండ్రులు సుశీలమ్మ, సుందర శివరావులు. కోటేశ్వరరావుగారి ధర్మపత్ని శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరిగారు. వీరికి ఇద్దరు పిల్లలు - షణ్ముఖశరణ్, నాగశ్రీవల్లి. ఇతిహాశాలను, పురాణాలను బాగాచదివారు. ఒకసారి సూర్యకళామందిరంలో జరిగిన ఒక కార్యక్రమం చూసిన తరువాత తనదృష్టి ఆద్యాత్మికతవైపు మరలిందని ఈ మధ్య ఏదో పేపర్లో చెప్పారు. పెద్దాపురంలో ఒక అద్యాత్మికసభలో మాతా చిన్మయదేవి ఒకరోజు ఉపన్యసించి, తరువాత ఎవరినైనా భాగవతంగురించి మాట్లాడమని కోరినప్పుడు చాగంటివారు మాట్లాడారట. అదే మొట్టమొదటి ఉపన్యాసం. తరువాత గురువుగారైన అమరేశ్వరప్రసాద్ గారి ప్రోత్సాహంతో ప్రవచనాలు చెయ్యడం కొనసాగించారట.
చాగంటి కోటేశ్వర రావుగారంటే చెప్పలేమత భక్తీ, అభిమానం గుండెలనిండా నింపుకొన్న వాళ్ళు దేశవిదేశాలలో లక్షలకొద్ది ఉన్నారు. ఫేస్‌బుక్‌లో ఎన్నో గ్రూపులు, పేజీలు వారిపేరుమీద నడుస్తూ ఉన్నాయి. అభిమానులు నడుపుతున్న చాగంటి.నెట్ అనే సైట్‌లో ఉపన్యాసాలు వినడానికి, చూడటానికి, డౌన్‌లోడ్ చెసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి.
ఈ ఆర్టికల్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. చాగంటివారిగురించి చెప్పాలనుకొనే విషయాలు ఏమయినా ఉంటే ఈ క్రింద కామెంట్ల రూపంలో చెప్పగలరని కోరుతున్నాను.
© Dantuluri Kishore Varma
Thank you for posting a very good and informative article about Sri Chaganti Koteshwar Rao garu.
ReplyDeleteమెచ్చినందుకు ధన్యవాదాలు జగన్మోహన్‌రావు గారు.
DeleteChala baagundhi mee article. Indulo naaku theliyani kotta vishayam Guruvu gaari modati pravachanam ekkada anedhi.
ReplyDeleteధన్యవాదాలు ప్రకాష్ గారు.
Deleteమంచి టపా. ధన్యవాదములు మరియు అభినందనలు.
ReplyDeleteప్రసాదరావుగారూ, చాలా సంతోషం!
Deletechala manchi article rasalu, ee taranki manchi vishayalu cheppe varu dorakadam mana adrustam
ReplyDeleteమీతో ఏకీభవిస్తున్నాను.
DeleteMee article chala bagundi, Chaganti varu Kakinada varu avvadam nigamga Garvinchadagga Vishayam, Vari valla Kakinada ki manchi peru vastondi.
ReplyDeleteచాలా థాంక్స్ శ్రీనివాస్‌గారు!
Deletemunduga chaganti lanti mahanbavulu ni varnichinanduku thanks..... mee article chadivi inka entho mandhi adyatmika margamulo nadvalani asidamu...
ReplyDeleteచాలా సంతోషం విశ్వతేజగారు. ధన్యవాదాలు.
DeleteNice Work ...Jai Sree Ram...Jai Sree Ram...Jai Sree Ram...
ReplyDeleteధన్యవాదాలు.
Deletena jeevitham marindi antye karanam ayyana sundarakanda pravachanam.., nenu kanapaditye pedavallu nana ani appayamga pillustunaru antye adi chaganti gari daya. sundarakandallo rama namam patukuna kabati nakki maryada antaru ayyana videos tiskeli andariki istuna kabati nakki appayata e roju nanu chusi na family, teachers garvapadutunaru antye e jeevitham ayana vesina biksha
ReplyDeleteచాగంటివారిపైన మీ భక్తి స్పష్టంగా తెలుస్తుంది. మీ స్పందనకు ధన్యవాదాలు.
Deletegood job
ReplyDeleteThank you very much!
Deleteబ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాలకు ప్రభావితులవ్వని వారు ఉండరు.నా అదృష్టం ఏమిటంటే ఉపాధ్యాయ దినోత్సవానికి ముఖ్య అతిధి గా మా స్కూల్ కి వచ్చిన వారిచేతులమీదుగా సన్మానించ బడడం . వారి ఆశీస్సులు ఈ విధంగా పొందడం పూర్వజన్మ సుకృతం
ReplyDeleteఇష్టపడేవారి చేతులమీదుగా సన్మానించబడినందుకు అభినందనలు ఆచార్యులుగారు.
DeleteChala bagundi andi ee article..Naku chaganti Garu ante cheppalenta istam inka cheppalante Pranam kuda..Bagavantuni angraham vallana Guruvu gari padalaku namaskarinchi ayana aashirvadam teeskune adrustam kaligindi .. adi naa janma lo marchipoleni samgatana..
ReplyDeleteసందీప్ గారూ, అదృష్టవంతులు మీరు.
Deleteచాగంటి వారి గురించి ఏమిచెప్పాలి,ఎంతని చెప్పాలి. నేను ఆయనను ఒక దేవునిగా కొలవటంతప్ప. మా ఇంటిలో నిత్యం ఆయన ప్రవచనాల ఆడియోలు కొనసాగుతూనే వుంటాయి. యెవరైనావస్తే నాకు చాలా ఆటంకంగా వుండి పాజ్లోవుంచి తరువాత కొనసాగిస్తా. మొదట్లో పిల్లలు,వారు విసుక్కునేవారు. పట్టించుకోలేదు. నెమ్మదిగా మా పిల్లలకు ప్రయాణ సమయాలలో,వాళ్ళ మూడ్ బాగున్నపుడు కొటేశ్వరవుగారి మాటలు చెప్పటం అలవాటు చేసా. వారిపుడు ఊరిలో ఉన్నా వాళ్ళ సిస్టంలో ప్రవచనాలు వింటున్నారు.మా వారుకూడా భాగవతం,సంపూర్ణ రామాయణం, ఆయన ప్రవచనం వినబడితే కూర్చుంటున్నారు. అదే చాగంటి వారి వాక్కులో వున్న గొప్పదనం. మాఇంటిలో కనబడని కుటుంబ సభ్యులు వారు. మాకు మాఇంటిలోనివారి గాత్రాలు ఎలా,ఎంత పరిచయమో వారి గాత్రమూ అంతే ఐపోయింది.అంతలా వారి ప్రవచనాలు మా కుటుంబాన్ని ప్రభావితం చేసారు వారు. ఇంతచక్కని అవకాశమిచ్చి గురువుగారిగురించి చెప్పుకునే భాగ్యం కలిగించినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteస్వరాజ్యలక్ష్మిగారు మీరన్న మాటలు అక్షర సత్యాలు. తెలుగు వారికి ఎందరికో ఆయన మాటంటే వేదవాక్కు.
Deleteభ్రహ్మశ్రీ చాగంటి వారు సరస్వతీ మానస పుత్రులే . వేదాలు , పురాణాల గురించి వీరు ప్రవచనాలు చెపుతూ ఉంటే ఎటువంటి వారైనా మైమరచి పోవలసిందే. వీరు తెలుగువారిగా జన్మించడం మనం చేసుకున్న అదృష్టం.
ReplyDeleteచక్కని మాట చెప్పారు శ్రీనివాస్ గారు. మీ కామెంటుకు ధన్యవాదాలు.
Deleteచాగంటిగారు నిజంగా బ్రహ్మమానసపుత్రులే. తెలుగువారికి ఒక మహనీయులు దొరికారు. వారి ప్రసంగం అలా కొనసాగుతుంటే మన హ్రుదయం అలా ఆర్ధ్రం అవకతప్పదు.
ReplyDeleteమీ విలువైన కామెంట్‌కి ధన్యవాదాలు :)
DeleteReally commendable article Varma garu. Sri Chaganti, leaving aside his domestic and career matters, has taken up the crusade to propagate our Sanatana dharma in the same scale as Swami Vivekananda did during the last century. His memory is elephantine, and eloquence unparalleled. May God give him many more long years ahead to continue this dharma prachaara yagnam.
ReplyDeleteThank you so much Sivaramakrishna garu for your appreciation of my article about Sri Chaganti Koteswara Rao garu. :)
Delete