నాలుగయిదు రోజులనుంచి రికార్డ్‌స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి
చెరువులు దొరువులు అన్నీ నిండాయి
కాలువలు వరదనీటితో పొంగిపొర్లుతున్నాయి
ఇంకా ముసురు విడిచిపెట్టలేదు
ఆకాశం నల్లని మేఘాలతో నిండి ఉంది
సూర్యుడు రోజులో ఎప్పుడయినా ఒక్కోసారి తొంగిచూసి మళ్ళీ మాయమైపోతున్నాడు
చల్లని వర్షంగాలి మధ్యలో ఎప్పుడయినా వచ్చే వెచ్చని సూర్య కిరణాలు హాయిగా ఉంటున్నాయి
జగన్నాధపురం వంతెన దగ్గర కాలువలో లాంచీలు లంగరువేసి ఉన్నాయి
పాతవంతెన పైనుంచి తీసిన ఆ ఫోటోలు మీకోసం..
* * *
1934లో ఒక పత్రికలో ప్రచురించిన జగన్నాదపురం వంతెన చిత్రం. శోభనాచల బ్లాగ్ రమణగారి సేకరణ. వారి అనుమతితో ఇక్కడ ఇస్తున్నాను చూడండి.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment