Pages

Friday, 4 October 2013

వ్యాపకం ఎక్కువ... జ్ఞాపకం తక్కువ...

పాలు కోసం
ఊలు కోసం
మాంసం కోసం, గొర్రెపిల్లల కోసం
మాత్రమే... పెంచుతారు గొర్రెల్ని

షెడ్డుకడితే నీడకోసమనీ
ఫుడ్డు పెడితే ప్రేమతోనేమోఅని
బుజ్జిగొర్రెల్ని మెడమీద ఎక్కించుకొని మోస్తే
తమ పిల్లలకి మహారాజయోగమనీ
నమ్మే, పిచ్చిగొర్రెలు. 

వీటికి వ్యాపకం ఎక్కువ
జ్ఞాపకం తక్కువ
కళ్ళముందు ఎన్ని తలలు తెగిపడినా
మంద మాత్రం కాపరి వెనుకే పోతుంది 

మీరు ఎన్ని చెప్పండి.. 
అట్లాంటి మందను నిర్వహించడమంత 
తెలివైన మంచివ్యాపకం
ప్రపంచంలో మరొకటి లేదు. 

*     *     *

ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్‌గారి కార్టూన్ - నాయకుడంటే అలా ఉండాలి. చూడండి గొర్రెలపెంపకపు మెళుకువలన్నీ ఉగ్గుపాలతో ఒంటబట్టించేసుకొన్న నాయకుడు ఎంత ఆనంద పరుస్తున్నడో! ఓటరయితే పాపం గొర్రెలాగే ఎంత ఆనంద పడిపోతున్నాడో!
 

© Dantuluri Kishore Varma 

6 comments:

  1. miiru cheppadaluchukunna vishayam emito ardham kaavadam leadu ..chaalaa confusion gaa undi ii post.....!!!!!!!

    ReplyDelete
    Replies
    1. స్వంతలాభంకోసం నమ్మినవాళ్ళని బలిచెయ్యడం అదే వ్యాపకం/వ్యాపారంగా పెట్టుకొన్న వాళ్ళతప్పుకాదు. కాబట్టి, మోసపోయాం అని వాపోయేవాళ్ళు ముందు జరిగిన మోసాలని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని చెప్పే ఉద్దేశ్యంతో రాసిన పోస్టు ఇది. నేను చెప్పాలను కొన్నది సరిగ్గా కమ్యూనికేట్ చెయ్యలేదనుకొంటాను. అందుకే మీరు కన్‌ఫ్యూస్ అయ్యారు.

      Delete
  2. మీరు చెప్పాలనుకొన్నది సరిగానే అర్దం అయ్యింది,
    కానీ మందలో ఉండటం తెలిసిన వారికి మందను తయారుచేయటం గూర్చి తెలీదు,
    దాని నుండి బైట పడటమూ తెలీదు.
    ఎదుటి వారి రక్తమాంసాలపై వ్యాపారం చేయటమే కాదు,
    శవాలపై కూడా జరుగుతుంది ఈనాడు. ఇంకా వివరముగా రాయండి వీలైతే గొర్రెపిల్లలను రక్షించండి. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. జనాలని ఉపయోగించుకోవడానికి కరుడుగట్టిన స్వార్థం, మోసగింపబడకుండా ఉండడానికి విచక్షణ ఉండాలి. రెండూ లేని వాడు మందలోనే మిగిలిపోతాడు. మీ స్పందనకి ధన్యవాదాలు.

      Delete
  3. చాలా బాగా చెప్పారు. ఇంకొంచెం డైరెక్ట్‌గా చెప్పితే బాగుండేదేమో?
    ఇప్పుడు చిన్న కాపరిని నమ్మి మోసపోతాయేమో?

    ReplyDelete
    Replies
    1. జార్జ్ ఆర్వెల్ రాసిన ఏనిమల్ ఫాం నవల ఎక్కడా రష్యా విప్లవం గురించి ఒక్క మాట చెప్పకుండానే నడుస్తుంది. ఐ థింక్, దట్ వాజ్ ఇండైరెక్ట్లీ డైరెక్ట్! ఈ పోస్ట్ కూడా అంతే!
      ఏమో, కావచ్చేమో బోనగిరిగారు!
      స్పందనకి ధన్యవాదాలు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!