Pages

Monday, 14 October 2013

యానం గోదావరి గట్టున...

కాకినాడకి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్రపాలితప్రాంతం పుదుచ్చేరీలో భాగమయిన యానం రేవులో, గోదావరి గట్టున విశేషాలు..
అతిఎత్తయిన భారతమాత విగ్రహం

ఒకచేతితో అభయహస్తం చూపిస్తూ, మరొక చేతిలో భారతదేశజెండాతో, వెనుక సింహం నిలుచుని ఉండగా బంగారువర్ణంతో మెరిసిపోతున్న భారతమాత విగ్రహం యానం బీచ్‌లో ఉంది. రాగి, తగరము, సీసము లాటి 11 టన్నుల బరువైన లోహాలు ఉపయోగించి దీన్ని తయారు చేశారు. భారతమాత  36 అడుగులు ఉంటుంది. వెనుక ఉన్న సింహం 15 అడుగులు. తయారు చెయ్యడానికి సుమారు అరవైలక్షల రూపాయలు ఖర్చు అయ్యిందట. కృష్ణాజిల్లాలో హనుమాన్ జంక్షన్ దగ్గర ఉన్న బొమ్ములూరు అనే ఊళ్ళో తయారు చేశారని హిందూ పేపర్లో రాశారు. 2010లో యానం ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ప్రతిస్ఠించారు. 

*     *     *
పెద్ద శివలింగానికి అభిషేకం చేస్తున్న ఏనుగులు


*     *     *
ముస్లింల ప్రార్ధనా మందిరం

ప్రార్థనకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. రోజులో ఐదుసార్లు చెయ్యాలి అంటారు - తెల్లవారుజామున, మధ్యాహ్నం, ఆతరువాత, సాయంత్రం, రాత్రి. నిద్ర, భోజనం, పని, అలసట, సౌఖ్యం అన్నింటికన్న ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయడమే. అరేబియా తీరంలో లంగరువేసి ఉన్నట్టున్న ఈ ఓడని యానం బీచ్ దగ్గర కట్టారు. ఇది ముస్లింల ప్రార్ధనా మందిరం - Nagoor Mera Saheb Jhanda Prayer Hall. 
*     *     *
బ్రెజిల్ వర్సెస్ యానం

బ్రెజిల్‌లో రియో డి జెనీరో లో ఒక కొండమీద నిర్మించిన 98మీటర్ల ఎత్తైన క్రైస్ట్ ద రిడీమర్ విగ్రహం మొత్తం బ్రెజిల్‌కి ఒక నేషనల్ సింబల్‌గా ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. సరిగ్గా అలాగే తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానంలో గోదావరి ఒడ్డున, బాలయోగి వారదికి సమీపంలో మౌంట్ ఆఫ్ మెర్సీని కట్టారు. చూడండి అవి రెండింటికీ ఎంత పోలికలు ఉంటాయో.
యానం
బ్రెజిల్
© Dantuluri Kishore Varma 

4 comments:

  1. నేను చూసాను సర్!

    ReplyDelete
    Replies
    1. చూడవలసిన ప్రదేశమే. చాలా బాగుంటుందండి.

      Delete
  2. ఇంకెక్కడి భారత మాత,
    భారతీయులమనే భాగ్యం ఎక్కడ మిగులుతుంది, ప్రతి ప్రాంతానికీ ఓ మాత వెలుస్తుంది ఇక ముందు.
    వర్మాజీ.., మీ కాకినాడ వాళ్ళు రుణపడి ఉన్నారు మీకు.

    ReplyDelete
    Replies
    1. నేనే మావూరికి, గోదావరికీ ఋణపడి ఉండాలి మెరాజ్‌గారు. రాయడానికి ఇన్ని విశేషాలు ఇస్తున్నందుకు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!