గుర్రపుడెక్కతో, తామరాకులతో అసలు నీరుందని కూడా తెలియనంతగా నిండిపోయి ఉండేది పిండాల చెరువు. అప్పుడప్పుడూ గుర్రపుడెక్క అంతా తొలగించి శుభ్రం చేసేవారు. కానీ, మధ్యలో ధ్యానముద్రలో ఉన్న శివుడి విగ్రహాన్ని కట్టి, చెరువు చుట్టూ గోడకట్టి, లోపల పార్క్ అభివృద్ది చేసిన తరువాత మొత్తం ఆ రోడ్డుకే అందం వచ్చింది. ప్రతీ శివరాత్రికీ తెప్పోత్సవం జరుగుతుంది ఇక్కడ. ఈ చెరువుకి వెనుక బాలాత్రిపురసుందరీ సమేత రామలింగేశ్వరస్వామి వారి దేవాలయం ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, చాలా పురాతనమైనది - 1884లో నిర్మించారు.
ఎల్లప్పుడూ త్రిపురసుందరీ అమ్మవారికి అత్యంత సుందరమైన పూల అలంకరణ చేస్తారు. గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. లోపలికి వెళితే బయటి ప్రపంచపు రణగొణ ధ్వనులేవీ వినిపించవు. ప్రశాంతంగా వుంటుంది. ముఖ్యంగా, దసరా పదిరోజులూ సందడిగా ఉంటుంది. త్రిపురసుందరీదేవి రకరకాల అలంకరణలతో దర్శనమిస్తుంది. చివరిరోజు బంగారు చీరలో ధగద్ధాయమానంగా వెలిగిపోతుంది. భక్తులు దర్శనానికి బారులు తీరతారు.
గుడిచుట్టూ ప్రదక్షిణ మార్గం వెంబడి ఇతరదేవుళ్ళ మందిరాలు విద్యుత్ దీపాల కాంతితో మెరిసిపోతూ ఉంటాయి., కళ్యాణమండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు, జనాలమధ్య పరుగులుపెట్టి ఆడుకొంటున్న పిల్లకాయలు, రుచికరమైన ప్రసాదం - హడావుడి అంతా ఇక్కడే ఉంటుంది.
© Dantuluri Kishore Varma
Very nice....temple is looking like a temple without any artificiality...very nice...
ReplyDeleteYou have rightly interpreted Niruji. Thanks for stopping by.
DeleteI like this temple very much Varma ji. I used to go this temple,whenever possible
ReplyDeleteదీప్తిగారు, ఈ దేవాలయంతో మీకున్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆ జ్ఞాపకాలని మాతో పంచుకొన్నందుకు ధన్యవాదాలు.
Delete