ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నవ్‌జిల్లా దౌండియాఖేరా అనే ఊరిలో ప్రాచీనమైన శివాలయం ఫోటోలు చూడచక్కగా ఉన్నాయి. కొంచం వొరిగినట్టు ఉండి, ఇండియన్ పీసా టవర్‌లా కనిపిస్తుంది. చూడగానే ఆకట్టుకొనేలా ఉంది. నాలుగైదు రోజులుగా ఏ పేపర్‌లో చూసినా ఈ శివాలయం ఫోటోలే కనిపిస్తున్నాయి. ఈ గుడికి సమీపంలో ఒక పురాతనమైన కోట ఉందట. అక్కడ వెయ్యిటన్నుల బంగారం పాతిపెట్టబడి ఉందని ఒక సాధువు కలగన్నాడట. ఆ వార్త ఆచెవినీ, ఈ చెవినీ పడి భారత పురావస్తు శాఖని చేరింది. నిధిని తవ్వి తియ్యమని పైనుంచి ఆదేశాలు అందాయి. పనిమొదలు పెట్టారు. నిజంగా నిధి బయటపడితే కలగన్న సాధువు గొప్పవాడైపోతాడు. ఇంకొకసారి ప్రపంచదేశాల దృష్టి భారత్‌మీద పడుతుంది. మిరాక్యులస్ ఇండియా మెరిసిపోతుంది. నిధి దొరకకపోతే శాస్త్రీయమైన ఆధారాలేమీ లేకుండా తవ్విపోసినందుకు పురావస్తు శాఖని దుమ్మెత్తిపోస్తారు.
ఫ్రెండ్స్ అందరం కూర్చున్నప్పుడు ఈ అంశంమీదకి సంభాషణ వెళ్ళింది. `ఈ తవ్వకాలవీ సుద్ద దండగ,` అన్నాడు ఒకాయన.`విలువైన సమయాన్ని వృధా చేస్తున్నార`న్నాడు.
ఎవరైనా ఒకవిషయం ప్రస్తావిస్తే వెంటనే వ్యతిరేకంగా వాదించేవాడు ఒక్కడైనా ఉంటాడు. `వాళ్ళేమీ అడవుల్లో తవ్వడంలేదు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశంలో చేస్తున్నారు. అయినా ఒక శాఖంటూ ఉండగా ఏదో పనిచెయ్యాలికదా? సాధువు కల ఫలితంగానైనా పని జరుగుతున్నందుకు సంతోషించు,` అన్నాడు వ్యతిరేకించే ఆయన.
వాదప్రతివాదాలు జరిగాయి. ప్రతీ డిబేటులాగే దీనికీ అందరికీ ఆమోదయోగ్యమైన ముగింపు రాలేదు. `సరే, నాలుగురోజులాగితే, బంగారమో, బండారమో బయట పడుతుంది కదా?` అనుకొని ఇళ్ళదారి పట్టాం.
© Dantuluri Kishore Varma
నిజంగా బంగారం దొరికితే దోచుకోడానికి కొత్త వనరౌ దొరికినట్టే కదా:)
ReplyDeleteఉన్నమాట చెప్పారు!
Deleteప్రభుత్వానికి మతిపోలే, మతిలేదంతే !
ReplyDeleteహ.. హా..!
Deleteరావుగారు మీ కామెంటుకి ధన్యవాదాలు.
సామాజిక ప్రయోజనం లేనిదీ, సామాన్య మానవునికి అందుబాటులో లేనిదీ వ్యర్దం అనిపిస్తుంది నా దృష్టి లో.. బహుశా ఇది నా బలహీనత కావచ్చు.
ReplyDeleteప్రభుత్వం ఇలాఅంటి పనులలో చాలా త్వరగా నడుస్తుంది. ఆహార విషయాల్లోనే ఆలస్యంగా స్పందిస్తుంది.
వర్మాజీ, ఆలోచింపజేసే మీ పోస్ట్ కి అభినందనలు.
నిజంగా బంగారం బయట పడినా సామాన్యునికి ఒరిగేది ఏమీలేదు.
DeletePonilendi...bangaram dorakkapoinaa padi mandiki konni roju lapatu tavve pani dorikindi...upaadhi dorikindi....
ReplyDeleteఆమాత్రమైనా ఉపయోగం జరిగిందని ఆనందపడవలసిందే. మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteyevariko eppudo kalalo devudi kanipinchi cheppadani vigrahaalani thavvi theesi tharatharaalugaa poojisthoo, manatharvatha tharaalaki carry chesthunnam. ippudemo.. hethuvaadam urthosthondi. Ade mana indianski vunna dual mind doubhagyam..
ReplyDeleteమీరు చెప్పింది బాగానే ఉంది అజ్ఞాతగారు. కానీ, ఇక్కడ తవ్వుతున్నది గుడిని కాదు. దానికి సమీపంలో ఉన్న ఒక కోటలో.
Delete