బెలూన్లు చూడగానే చిన్నపిల్లల కళ్ళల్లో సంతోషం
చదువుకోవలసిన వయసులో పనిచేసుకొంటున్నాడని కవి గుండెల్లో జాలి
`అమ్మా బుడగలమ్మి డబ్బుతెచ్చా,` అంటే తల్లి చూపుల్లో తృప్తి
`విచారమా, కష్టమా, అసంతృప్తా..నీ బాధేమిటి?` అంటే...
`బుడగ ఐదురూపాయలు. కావాలా, వద్దా?` అంటాడు వాడు.
త్రిపురసుందరి గుడి బయట దసరా రోజుల్లో గ్యాస్ బెలూన్లు అమ్ముతున్న అబ్బాయి.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment