Pages

Monday 24 February 2014

స్ట్రీట్ వెండర్

ఉదయం ఏడుగంటల సమయంలో ఆకుకూరలవాడు సైకిలు మీద వస్తాడు. తాజా తోటకూరో, పాలకూరో మరొకటో ఇచ్చి వెళతాడు. మధ్యాహ్నం బటానీలు, మొరమొరాలు అమ్మే సైకిలువాడు. ఇలా ఇంటింటికీ తిరిగి అమ్మే హాకర్లు, రోడ్డు కూడళ్ళలో, రోడ్డుకి ఇరువైపులా నాలుగుచక్రాల బళ్ళమీద రకరకాల వస్తువులు అమ్మే వెండర్లు ప్రతీఊళ్ళోనూ ఉంటారు. పళ్ళు, కాయగూరలు, బొమ్మలు, బనీన్లు, ఫ్యాన్సీవస్తువులు, స్వీట్లు, పిడతక్రిందపప్పు, బజ్జీలు, పావుబాజీ, పానీపూరీ లాంటి చిరుతిళ్ళు అమ్మే వాళ్ళు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ కోటిమంది వరకూ ఉన్నారట. వీళ్ళంతా స్వయం ఉపాది పొందుతున్నవాళ్ళు. 
Pic Credits: Raghu Varma
మెయిన్‌రోడ్డు మంచి రద్దీగా ఉన్నసమయంలో, రోడ్డువార సైకిళ్ళమీద, బళ్ళమీద సరుకులు అమ్మేవాళ్ళలో అకస్మాత్తుగా అలజడి వస్తుంది. తమసరుకులతో సహా పరుగులు పెడతారు. ఈ అలజడికి కారణమైన మునిసిపాలిటీ అధికారులో, పోలీసువాళ్ళో వీళ్ళను దొరకబుచ్చుకొన్నారంటే అంతే సంగతులు. పదో, పరకో గుంజుకోవడమో, సరుకులూ స్వాధీనంచేసుకోవడమో, చక్రాల్లో గాలితీసెయ్యడమో, మరొకటో జరుగుతుంది. ఒక్కదెబ్బకి లాభం గూబల్లోకి వస్తుంది. 

రాజ్యసభలో తెలంగాణా బిల్లుకి ఆమోద ముద్ర వెయ్యడానికి రెండురోజుల ముందు(19.02.2014) స్ట్రీట్ వెండార్ల బిల్లు కూడా పాసయ్యింది. వీధుల్లో అమ్ముకొనేవాళ్ళకి లైసెన్సులు ఇచ్చి, సరుకులుపెట్టి అమ్ముకోవడానికి ప్రత్యేకమైన జోన్లని కేటాయిస్తారట. 

అధికారుల భయంలేకుండా అమ్ముకోవడానికి వాళ్ళకీ, కేటాయించిన జోన్లలోనే అమ్ముకొంటారు కనుక ట్రాఫిక్‌కి అంతరాయం కలగకుండా నగరవాసులకీ బాగానే ఉంటుందనుకొంటాను.   

© Dantuluri Kishore Varma

7 comments:

  1. do u think Govt. even do any such good things?its all to know about the their income with actual data about them. in todays politics nothing is introduced in favour of people.certainly they have their actual motto behind them which may be proved in near future.

    ReplyDelete
    Replies
    1. ఈ బిల్లు పాస్ చెయ్యడానికి వెనుక కారణం వాళ్ళ ఆదాయ వివరాలు తెలుసుకోవడం అంటారా!?

      Delete
  2. Varma Garu,
    Antha Telangana bill gola lo unna,meeru Street Vendor Bill gurichi Vrayatam chala Bagundi....Good Attempt.Once again U have proved why every one waiting daily for Mana Kakinada Blog Article----Naveen

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానానికి ధన్యవాదాలు నవీన్‌గారు. :)

      Delete
  3. మీరు అన్నట్టుగా ఈ bill అంతగా ఉపయోగ పడుతుందా..
    licence లు ఇస్తారు అంటున్నారు, licence లు తీసుకోలేకే కదా వాళ్ళు రోడ్ల పైన, వీదుల వెంబడి తిరుగుతూ అమ్ముకునేది... ఈ bill లో ఏముంది చెప్మా... కొంచెం విచరిస్తార... :p O_O

    ReplyDelete
    Replies
    1. ఆ బిల్లు పూర్తిగా నేనూ చదవలేదు. చిన్న వ్యాపారాలకి చిన్నస్థాయిలో లైసెన్స్ ఉండవచ్చుకదా? ఈ రకమైన వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఉంటుంది కనుక వెంటపడి తరిమే అధికారులకి భయపడవలసిన అవసరం ఉండదు. ఇక ఇంప్లిమెంటేషన్ అంటారా!? బిల్లులు ఎన్ని పాస్ చేసినా, అమలుపరిచాలంటే చిత్తశుద్ది ఉండాలి. వాళ్ళ నిబద్దత గురించి మీరూ, నేనూ ఎష్యూరెన్స్ ఇవ్వలేము కదా?

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!