కార్లు, బైకులు, ఆటోలతో సహా రోడ్డుమీదవెళ్ళే సమస్త వాహనాలలో తొంబైశాతం అక్కడ ఆగుతాయి. రోడ్డువార చెట్టు, చెట్టుక్రింద ఒక దేవత ఫోటోనో, విగ్రహమో పసుపూ, కుంకాలు అద్ది ఉంటుంది. ప్రయాణంలో ఏ ఇబ్బందులూ కలగకుండా ఉండాలని ప్రార్ధించుకొని, కుంకుమ బొట్లు ముఖాలకీ, వాహనాలకీ పెట్టుకొని, పళ్ళెంలో దక్షిణ వేసి ముందుకు సాగుతారు జనాలు. రోజులు పెరిగే కొలదీ భక్తుల రద్దీతో పాటూ, గుడికూడా పెరుగుతుంది. అక్కడ ఆగి వెళ్ళకపోతే ఏదో కీడు జరుగుతుందని భావించడం వల్లకూడా చాలా మంది వాహనాలను నిలుపుతారు. ఏది ఏమయినా నగరంలోనుంచి బయటకు వెళ్ళే ప్రతీ ప్రధానమార్గంలో ఒక్కో దేవత రాకపోకలని పర్యవేక్షిస్తుంది. ఉదాహరణకి కాకినాడనుంచి సామర్లకోట వెళుతుంటే ముత్యాలమ్మతల్లి, గొల్లపాలెం వైపు ధనమ్మతల్లి, యానాం దారిలో తలుపులమ్మతల్లి మొదలైనవి... అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనే విశ్వాసాన్ని కలిగిస్తూ...
© Dantuluri Kishore Varma
thalupulamma thalli Tuni daggara kada undedi ???
ReplyDeleteఅవునండి, అది తలుపులమ్మతల్లి లోవ.
Delete