ఇది చొల్లంగి కాలువ. కాకినాడకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. గోదావరి నది యొక్క ఏడుపాయల్లో ఒకటైన తుల్యబాగ ఇక్కడినుంచి సముద్రంలో కలుస్తుంది. చొల్లంగి అమావాస్యరోజు ఇక్కడ స్నానాలు చెయ్యడం చాలా పుణ్యంగా భావిస్తారు భక్తులు. దీని నిజమైన ప్రత్యేకత ఏమిటంటే - కాకినాడనుంచి యానం వైపు వెళూతున్నప్పుడు ఈ ప్రదేశాన్ని ముక్కు మూసుకోకుండా ఎవ్వరూ దాటలేరు. ఒకవేళ అలా దాటారూ అంటే వాళ్ళు అక్కడి వాళ్ళయినా అయివుండాలి లేదంటే ఆ మార్గం గుండా రోజూ ప్రయాణీంచేవాళ్ళయినా అయివుండాలి. దానికి కారణం ఎండబెట్టిన చేపలు, రొయ్యల వాసన. ప్రొద్దుటనుంచి సాయంత్రం వరకూ రోడ్డుప్రక్కన రెండువైపులా వీటిని ఎండబెడతారు. ఒకకిలోమీటరు దూరం వరకూ ఈ ఎండబెట్టుడు కార్యక్రమం ఉంటుంది. ఇది కోళ్ళ మేతకోసం వాడతారని అంటారు.
నాటు పడవలమీద కుటుంబాలు, కుటుంబాలు ఉంటాయి. ఇంటి(పడవ)పెద్ద పడవకి ఒక కొనమీద కూర్చొని వల చిక్కు తీసుకొంటూ ఉంటాడు. రెండవకొనమీద అతని భార్య వంటచేస్తూవుంటుంది. పిల్లలు అక్కడే ఆడుకొంటూ ఉంటారు. చుట్టూనీరు! పొరపాటున అందులో పడతారేమో అని భయంవేస్తూ ఉంటుంది చూసేవాళ్ళకి. పడవే వాళ్ళ ఇల్లు. తిండి, పని, నిద్ర, ఆట అన్నీ దానిమీదే. కొంతకాలం క్రితం ప్రభుత్వంవాళ్ళు పడవలమీద పిల్లలకి చదువు చెప్పడానికి స్కూల్ఆన్‌బోట్ అనే బడిని పెట్టారు. ఈ పడవఇళ్ళ సమీపంలో నీటి మీదతేలుతూ చాలా కలర్‌ఫుల్‌గా ఉండేది. కాలువ గట్టుమీద చిన్న హట్‌లాంటి సిమ్మెంట్ నిర్మాణం కూడా చేశారు. పడవబడి అనో, మరేదో రాసి ఉండేది దాని మీద. కొంతకాలం నడిచింది. తరువాత ఆగిపోయినట్టుంది. ఇంకా.... చెప్పడానికి ఏమీలేదు. అంతే!
© Dantuluri Kishore Varma
well said
ReplyDeleteధన్యవాదాలు శర్మగారు.
Deleteఅవునండి వర్మగారూ1 చాల చిన్నతనం లో కాకినాడ విడిచి వెళ్ళాక,మొన్న ముక్కోటిఏకాదశి కి అమలాపురం వెక్కి అక్కడనుంచి యానాం వంతెన మీదుగా కాకినాడ వస్తున్నప్పుడు. మీరు రాసిన దృశ్యాలు కనిపించాయి. అలాగే ఆ స్మెల్ కూడా ముక్కులు బద్దలయ్యేలా1 అయతే ఆ రోజు ఒక తమషా కూడా జరిగింది ఆ గంగపుత్రుల ఇళ్ళ దగ్గర. ఇంక చీకట్లు పడకముందే బాగా తాగివచ్చిన భర్తను పట్టుకొని ఒక ఇల్లాలు చీపిరికట్టతిరగేస్తూ వెంటబడుతోంది.కోరంగిదగ్గర. నాకు మణిరత్నం కడలి సినిమా కూడా గుర్తుకొచ్చింది. ఇలాంటి దృశ్యాలు భీమిలి వెళుతున్నప్పుడు కూడా కనిపిస్తాయి
ReplyDeleteమనకాకినాడలో.. బ్లాగ్‌కి మీకు స్వాగతం. ఈ మధ్యనే ఎర్రమట్టి దిబ్బలు చూద్దామని వైజాగ్ నుంచి భీమిలివైపు ప్రయాణం చేశాను. మీరు చెప్పిన పోలిక అక్షరాలా నిజం. చొల్లంగి కాలువదగ్గర ఉండే వాతావరణం లాంటిదే అక్కడకూడా. ధన్యవాదాలు.
Delete