Pages

Thursday, 16 January 2014

ఇలాంటి బ్లాగ్ఎక్స్‌ప్రెస్ మనవాళ్ళు కూడా పెడితే బాగుంటుంది కదా?

కేరళా టూరిజం డెవలప్‌మెంట్ వాళ్ళ దగ్గరనుంచి మనవాళ్ళు నేర్చుకోవలసింది చాలా ఉంది. వాళ్ళు తమ రాష్ట్రంలో చూడచక్కని బీచ్‌లని, దేవాలయాలని, ప్రకృతి అందాలని, సంస్కృతీ సంప్రదాయాలని, వైద్యవిధానాలనీ చక్కగా ప్రమోట్ చేసుకొంటారు. రాష్ట్రాన్ని `గాడ్స్ ఓన్ కంట్రీ` అని పిలుచుకొంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులని ఆకర్షిస్తున్నారు. ఈ మధ్యనే కేరళాబ్లాగ్ఎక్స్‌ప్రెస్(బ్లాగ్ఎక్స్‌ప్రెస్ గురించి, కేరళా గురించి సమాచారం ఈ లింక్‌లో దొరుకుతుంది) అనే విన్నూత్న ప్రోగ్రాంని డిజైన్ చేశారు. అంతర్జాతీయంగా పాతికమంది ట్రావెల్ బ్లాగర్స్‌ని ఎంపికచేసి పదిహేనురోజులపాటు రాష్ట్రమంతా తిప్పుతారు. వాళ్ళని రోడ్డు మార్గం ద్వారా లగ్జరీ బస్సులో మంచి మంచి ప్రదేశాలన్నీ తిప్పి, బస, భోజన ఏర్పాట్లు చేసి, వాళ్ళు తమ తమ సోషల్ మీడియా ఎకౌంట్లద్వారా, బ్లాగులద్వారా ఎప్పటికప్పుడు స్టేటస్ అప్డేట్‌లు చేసుకోవడానికి, బ్లాగ్‌పోస్టులు ఫొటోలతో సహా రాయడానికి వైఫై సౌకర్యం కలుగజేస్తారు. ఇలా చెయ్యడం ద్వారా కేరళా టూరిజం వాళ్ళకి అయ్యే ఖర్చు,  దాని ద్వారా వాళ్ళకి వచ్చే ప్రచారం తత్ఫలితంగా పెరిగే పర్యాటకుల సంఖ్య, వారినుంచి వచ్చే ఆదాయం లెక్కవేసుకొంటే ఎంత విజ్ఞతతో ప్రచారం చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.  

మనరాష్ట్రంలో కేరళాకి ఏమాత్రం తగ్గని అందాలు ఉన్నాయి. కోనసీమలో పచ్చనిపొలాల మధ్య ఫోటోలు తీస్తే అవి కేరళాలో తీసినవో, మనరాష్ట్రంలో తీసినవో తెలుసుకోవడం కష్టం. అలాగే మనపురాతన దేవాలయాలు, కోటలు, సముద్రతీరప్రాంతాలు, ఏజన్సీ, చారిత్రక కట్టడాలు, మన సంస్కృతి అన్నీ గర్వంగా ప్రపంచానికి చూపించవలసినవే. కానీ ప్రచారం జరగడం లేదు. టూరిజం ఆఫీసులో ఓ పేకేజ్ టూర్‌గురించి వాకబు చేస్తే కళ్ళుతిరిగే రేట్లు చెప్పారు. `ఇంతఎక్కువా?` అనకుండా ఉండలేకపోయాను. నాతోపాటూ రిసెప్షన్ డెస్క్ దగ్గర ఉన్న ఒకాయన అన్నమాటలు, `మనవాళ్ళు టూరిజాన్ని మునిసిపాలిటీ ఆవులా చూస్తారు. ఖర్చు లేకుండా రోజంతా అది రోడ్లమీద దొరికే చెత్తా చెదారం తింటే, సాయంత్రం పాలు పితుక్కోవచ్చు.` 

పన్నెండు సంవత్సరాలక్రితం అరకు దగ్గర ఉన్న చాపురాయి అనే ప్రాంతం చూశాను. చాలా అందంగా ఉంది. కొన్నిరోజుల క్రితం మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు సంరక్షణలేక పాడు పడిపోయినట్టు ఉన్న కట్టడాలు, ఎండిపోయిన మొక్కలు, చెత్త పేరుకొని పోయిన పరిసరాలు చూసి అనవసరంగా ఈ ప్రదేశానికి వచ్చాం అనిపించింది. ఎంట్రన్స్ దగ్గరమాత్రం టిక్కెట్లు యదాతదంగా అమ్మేస్తున్నారు!     

© Dantuluri Kishore Varma 

8 comments:

  1. మనవాళ్ళుట్టి ....అని చాలాకాలం కితం చెప్పేరు....పెద్దాయన...

    ReplyDelete
    Replies
    1. హ..హా శర్మగారు, ఒక్కమాటలో సూక్ష్మాన్ని చెప్పారు.

      Delete
  2. అక్షరాలా నిజం వర్మ గారు! మనవాళ్ళకెంత సేపు పనికిమాలిన సొల్లు రాజకీయాలు తప్ప ఇంకో దాన్ని ఆనందించేంత జ్ఞానం ఎక్కడిది..? అరకు అందాలు గాని...విశాఖ ఘాట్ అందాలు గాని..రాష్ట్రం అంతటా ఉన్న ఆలయాలు, బౌద్ధ,జైన చారిత్రక నిర్మాణాలు గాని,ఇలాంటివి ఎన్నో..ఎన్నో ... అంకిత భావం తో ప్రచారం చేస్తే పర్యాటకులు ఎంతోమంది వస్తారు.ఒక్క చార్మినార్ ..గోల్కొండ తప్ప మరొకటి ప్రపంచానికి పరిచయం చేయగలిగిందా మన టూరిజం శాఖ...? అన్నట్టు ఆ బ్లాగు ఎక్స్ ప్రెస్ పోటీ లో ఫాల్గొంటున్న ప్రసాద్ అనే తెలుగుబ్లాగరు కి ఒక ఓటేశాను.

    ReplyDelete
    Replies
    1. దురదృష్టవశాత్తూ ఈ పోటీగురించి నాకు జనవరి పదకొండున డెక్కన్‌క్రోనికల్‌లో న్యూస్ఐటం చుసేవరకూ తెలియలేదు మూర్తిగారు. అప్పటికే పాల్గొనడానికి చివరితేదీ ముగిసింది. ఇంటర్నేషనల్ బ్లాగర్లు చాలామంది ఎంపికయ్యారు. ఇక ప్రచారమే, ప్రచారం!

      Delete
  3. All are forgetting one thing- Union Tourism minister is from AP. Busy in lobbies with lobbying- collections and elections

    ReplyDelete
  4. i came across ur blog thru some1's fb.glad 2 know ur blogging in telugu abt andhra.will try to read all ur posts.ika pt. ki vastey edo sametha cheppi nattu "angatlo anni unna alludu notlo ......."mana alludulu evaro andariki ardamaye untundi,mana politicians.alludu avakasaani upayo ginchukoleni moorkhudu. endukante vaallaki burra ledu.dabbu kanipiste loop line lo ela fraud cheyalo maatram baaga telusu.enta kaadanna idanta mana swayam krutame.mana eg dst lo summaaru 60 mandalalu unnayi.ante mana 50 lakhs janabha lo 60 mandi vaalla oorugunchi inti gurunchi maatla dithey, kanisam 30 lakh mandiki vinipistundi.kaani cheyaru .vaalaki siggu,chinnatanam feel avutaru.develop ayyi peru vastey maatram ,vaallu credit unnatu chaatukuntaaru.mindset maare varaku emi cheya lemu.

    ReplyDelete
    Replies
    1. మండలానికి ఒకరు చొప్పున మాట్లాడాలన్నారు. సమస్యలగురించా, మండలంలో విశేషాల గురించా.. నాకు సరిగా అర్థం కాలేదు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!