పిండితో చుక్కలు పెట్టి, అందమైన గీతలతో ముగ్గులు పెట్టి, రంగులతో అలంకరించి, బంతుపూల రేకులు అద్ది, తళుకులీనే మెరుపులు జల్లి, మధ్యలో గొబ్బెమ్మలుపెట్టి పౌష్యలక్ష్మికి స్వాగతం పలికే లోగిళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? మొక్కుబడికి వేసే ముగ్గుల గురించికాదు నేను చెప్పేది - ఇష్టంతో వేసే ఇలాంటి సంక్రాంతి ముగ్గులు మనం చూసి ఎంతకాలం అయ్యింది!
బడికి, బ్లాగ్‌కి శెలవు చెప్పి అలా, అలా తిరిగి వచ్చాను ఓ నాలుగు రోజులు. వైజాగ్ సాగరతీరంలో, అరకులోయలో డీస్ట్రెస్సింగ్. వైజాగ్ మురళీనగర్లో సాయంత్రం చలి భయపెట్టడం మొదలుపెట్టే సమయానికి, దూరంగా ఉన్న కొండలు బూడిదవర్ణం నుంచి నీలిరంగులోకి మారుతున్నప్పుడు, మంచుతెర మేలిముసుగులా పట్టణం మీద పరుచుకొంటున్నప్పుడు... మా అన్నయ్యగారి ఇంటిదగ్గరనుంచి అల్లంత దూరంలో ఉన్న వైభవ వెంకటేశ్వరస్వామి గుడికి నడిచి బయలుదేరాం. స్ట్రీట్‌లైట్ల వెలుగుల్లో, వాహనాల హెడ్‌లైట్ల కాంతిలో, షాపు అద్దాల్లోనుంచి రోడ్డుమీదకి పడే వెలుగు నీడల్లో మంచుని చూడడం నాకు చాలా ఇష్టం. అందుకే నడక.
Shot in daylight |
Shot in daylight |
నిశ్చల సరస్సులో తామరపువ్వుల్లాగ తెల్లని గోపురాలతో వెంకటేశ్వరస్వామి గుడి, గుడిముందు ఇద్దరు ముగ్గురు మహిళలు రంగవల్లులు వేస్తున్నారు. మండువేసవిలో చల్లని పానీయం గొంతుదిగుతున్నప్పుడు ఎలా ఉంటుందో, మంచు కురిసే సాయంత్రం ఇలాంటి దృశ్యం మనసుకి అలానే అనిపిస్తుంది. మూడొంతులు పూర్తయిన ముగ్గును చూస్తూ లోనికి వెళ్ళాం. ప్రాకారంలో ధక్షిణంవైపు తిరుప్పావై ఆ మరునాటి పాశురానికి సంబంధించిన ముగ్గు వేస్తున్నారు.
దర్శనానంతరం బయటకు వస్తూ, పూర్తయిన రంగుల ముగ్గులు చూసి మెచ్చుకోకుండా ఉండలేక పోయాను. అక్కడే ఉన్న ఒకాయన అప్పటివరకూ రంగవల్లులు దిద్దిన ఒక అమ్మాయిని చూపించి `గత పదిసంవత్సరాలుగా ప్రతీసంవత్సరం పండుగనెలలో క్రమం తప్పకుండా ఈ వేంకటేశ్వరస్వామి గుడి ముందు ఇలానే వేస్తుందని,` చెప్పారు. దేవుడికి అది ఒక సేవ!
© Dantuluri Kishore Varma
thanks andi, vizag move avutunnamu koddi rojullo, meeru chupinchina temple welcome cheputtunatlu ga vundi.
ReplyDeleteవిష్ యు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ధన్యవాదాలు.
DeleteChaala Chakkati Vishayalu chepparu. Aa Muggulu Aa Gudigopuralu Meeto Memukuda Tirigina Anubhuti Kaliginchayi. Chaala Thanks.
ReplyDeleteమీకు నచ్చడం సంతోషాన్ని కలిగించింది. ధన్యవాదాలు.
Deleteప్రతిదీ చూసి గుండె గుప్పిట్లో బందించే చక్కటి గుణం మీది.
ReplyDeleteచాలా, చాలా థాంక్స్ మీ అభినందనలకి మెరాజ్ గారు.
Deleteబిజీ అయిపోయారు, మా బ్లాగ్ మీద సీత కన్ను వేశారు.
Deleteఅయ్యో అదేమీ లేదండి. విశేషాలు మరచిపోతానేమో అని భయంతో గబ,గబా రాసేస్తున్నాను. ఆ చాపల్యంతోనే మిత్రుల బ్లాగులు కూడా చదవకుండా.. ఇదిగో ఇలా మీకు దొరికిపోయాను.
Delete