అప్పుడైనా రొట్టెని పానకంలో ముంచుకొని తిన్నారా? తినిఉంటే ఆ రుచిని మీరు తప్పనిసరిగా `అమోఘం!` అని అనాల్సిందే. `ఇంతకీ, ఏ రొట్టి?` అని అడిగితే, `ఏ రొట్టయినా..` అని సమాధానం చెప్తాను. `ఏ పానకం?` అని అడిగితే మాత్రం `చెరుకుపానకం,` అనే చెప్తాను. చెరుకు పండే ప్రాంతాల్లో బెల్లం తయారీ కోసం క్రషర్స్‌ని ఏర్పాటు చేస్తారు. పల్లెప్రజల నోళ్ళల్లోనాని రూపుమారిపోయిన మాటల్లో క్రషర్ ఒకటి. వాళ్ళు దానిని కస్సర్ అని పలుకుతారు. మనం రోడ్డువార, జ్యూస్ సెంటర్లలో చెరుకురసం తీసే మెషీన్లని చూస్తాం కదా? అటువంటివే క్రషర్లంటే. ఈ క్రషర్స్ దగ్గర బెల్లంతో పాటూ, రొట్టెల్లో నంజుకోవడానికి ఉపయోగపడే పానకం కూడా లభ్యమౌతుంది. ఓ పదిరోజుల క్రితం కాకినాడకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి వెళ్ళాను. సామర్లకోటకి నేషనల్ హైవే ఐదు మీద ఉన్న ప్రత్తిపాడుకి మధ్యలోచెరుకు విస్తారంగా పండే భూములు, వాటిని చేర్చి బెల్లం తయారీ కేంద్రాలు ఉన్నాయి.
చెరుకు తోటల్లోనుంచి చెరుకుని కోసుకొని వచ్చిన తరువాత, క్రషర్ ద్వారా రసం తీస్తారు. దానిని బెల్లం వండడానికి ఉపయోగించే ఇనుప పెనంలోకి పంపి, క్రింద మంట పెడుతూ, పెద్ద చట్రం గరిటతో కోవా కలిపినట్టు కలుపుతారు. ఇక్కడ పొయ్యిలో మంటపెట్టడానికి ఉపయోగించే వంటచెరుకు రసం తీసేసిన చెరుకుపిప్పే! బాగా ఎండబెట్టి వంటచెరకుగా వాడతారు. రసం మరుగుతూ, చిక్కబడుతున్నప్పుడు తియ్యటి వాసన భలేగా ఉంటుంది. నోరూరిపోతుంది. రసంలోని వ్యర్థపదార్థాలు, పిప్పి మొదలైనవి తెట్టిలా తేలిపోతాయి. (అలా వ్యర్థాలు వేరుచేయడానికి కొన్ని రసాయనాలని కలుపుతారు). వాటిని గరిటతోతీసి వేరుచేసేస్తారు. క్రమంగా పానకం బంగారు రంగులోనికి మారుతుంది. పాకం తీగలుగా సాగుతుందనిపించే సమయానికి మౌల్డ్‌లోకి వొంపి, ఆరబెడతారు. బెల్లం ఆరి, గట్టి బడుతుంది. అప్పుడు మౌల్డ్‌లలోనుంచి బయటకు తీసి ప్యాక్‌చేసి, అట్టపెట్టెల్లో సర్ధి, మార్కెట్‌కి పంపుతారు.

మనం చెరుకు పానకం గురించి మొదలుపెట్టి బెల్లం తయారీ దాకా వచ్చేశాం. కొంచెం వెనక్కు వెళ్ళి పానకం తెచ్చుకొందాం! తెట్టు తీసేసిన తరువాత, తీగపాకం రావడానికి ముందు పాకాన్ని డబ్బాల్లోకి తీసి చల్లారనిస్తారు. తరువాత సీసాల్లో నింపి అమ్ముతారు. ఇలా తయారుచేసిన బెల్లం పాకానికి ఇంచుమించు తేనెకు ఉన్నన్ని పోషక విలువలు ఉంటాయని చెపుతారు.
హైవేల్లో ప్రయాణిస్తున్నప్పుడు, చెరుకుతోటలు కనిపించిన ప్రదేశాల్లో కొంచెం జాగ్రత్తగా గమనిస్తే బెల్లం తయారీ కేంద్రాలు కనిపిస్తాయి. అటువంటప్పుడు తప్పనిసరిగా వెళ్ళిచూడండి. తయారుచేసే విధానం బాగుంటుంది. ముఖ్యంగా తీపి వాసన!
© Dantuluri Kishore Varma
చాలా బాగుందండి. ఆ వీడియో మీరే తీసారా? ఆ మాట్లాడుతున్న ఆయన యాస, షూటింగ్ చేస్తున్న వారి మాటలు ఆ చెరుకు పానకంలానే తియ్యగా ఉన్నాయి :)
ReplyDeleteతేనె కన్నా తియ్యనిది తెలుగు భాష...నిజంగా కదా. ఆయన మాట్లాడే చాలా పదాలు నాకు తెలియనివే. అయినా ఎంత సొగసు ఆ మాటల్లో...
నేనెప్పుడు కోస్తా ప్రాంతాలు చూడలేదు. ఎప్పుడైనా వెళ్ళే అవకాశం వస్తే తప్పకుండా రొట్టె, చెరుకు పానకం కాంబినేషన్ ట్రై చెస్తాను.
Thanks for sharing.
ఈ ప్రాంతానికి ఎప్పుడు రాకపోయినా ఎంతో అభిమానాన్ని వ్యక్తంచెయ్యడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ వీడియో నేను తీసిందే. మిగిలిన రెండు వాయిస్‌లలో ఒకటి నాది, రెండవది నా శ్రీమతి శుభది :)
Deleteపోస్ట్ఫో ,టోలు బాగున్నాయండి .మా వైపు బాగానే దొరుకుతుందండి పానకం .
ReplyDeleteధన్యవాదాలు రాధికగారు.
Deleteచా గొప్పగా,వింతగా అనిపిస్తాయి ఇలాంటి టపాలు. నాకు బెల్లం వండుతారని తెలీదు.
ReplyDeleteఅందుకే అభినందనీయులు మీరు అన్నాను.
ధన్యవాదాలు మెరాజ్‌గారు :)
DeleteA typycal Godavari Accent.
DeleteOCTOBER NUNDI SANKRANTI VARAKU EE BELLAM TAYARI NADUSTUNDI.MA MEDA MIDA CHETILO CHINNA TRANSISTOR TO VENNELLO KURCHUNI PATALU VINTU UNTE GALI LO TELI VACHE BELLAM SUVASANALU VARNINCHAGALAMA?ADI BELLAM VASANA KADU.KAMMANI MA OORI VASANA.
ReplyDeleteజ్ఞాపకాల దారుల్లో వెనక్కివెళ్ళి మీవూరిని పలుకరించి వచ్చినట్టున్నారు. మీ కామెంట్‌కి ధన్యవాదాలు విజయ కుమారి గారు.
Delete