ఒక ప్రోజెక్ట్ మొదలు పెట్టి, దానికోసం ఒక పెయింటర్‌కి రెండు బొమ్మలు పెయింట్ చేసే పని అప్పగించాను. తీరుబడిలేని కమర్షియల్ ఆర్టిస్టు అతను. కానీ, మాట తీసెయ్యలేక రాత్రంతా కూర్చొని ఉదయానికల్లా పెయింట్ చేసి ఇచ్చాడు. అతనికి బొమ్మలు వెయ్యడంతో నిద్రలేకుండా పోతే, నాకు అవి ఎలా వస్తాయో తెలియక నిద్ర పట్టలేదు. బాపూ బొమ్మలో అందమైన వంకర గీతలు, దామెర్ల రామారావు బొమ్మల్లో సొగసు, టర్నర్ వాటర్ కలర్స్‌లో వెలుగూ కలిసి ఊహల్లోనే అద్భుతంగా కనిపించడం మొదలయ్యాయి. ప్రొద్దుటే వాటిని ఎలా చూసానో అనే విషయాన్ని ప్రక్కన పెడితే - మన బ్లాగర్ మిత్రులు చిన్నిఆశలాగ చిత్రకారుడినయినా కాకపోతినే అని నాకు నేనే వగచాను. అతనికిచ్చిన రిఫరెన్సుల్ని నేనుకూడా పెయింట్‌చెయ్యడం ప్రయత్నిస్తే బాగుంటుందని అనిపించిన ఒకానొక క్షణంలో బ్రష్‌ని వాటర్ కలర్లో ముంచి డ్రాయింగ్ షీటు మీద యుద్దం మొదలుపెట్టా! దాని ఫలితమే ఈ `పల్లెకు పోదాం.. చలో.. చలో..` పెయింటింగ్.
క్షణక్షణం సినిమాలో పరేష్ రావల్ పియానో మీద ఒకరాగం వాయించి, తన కూనిరాగం కూడా కలిపి అనుచరుడ్ని..`ఇది ఏం పాటో చెప్పు?` అని అడుగుతాడు. పాపం వాడు, `తెల్వాదు సార్,` అంటాడు.
పరేష్ రావల్ పాటలాగ అయ్యింది నా పెయింటింగ్ సంగతి. ప్చ్! ఏం చేస్తాం, కళను నేర్చుకోలేక పోతిమి.
© Dantuluri Kishore Varma
ఏవరన్నారవి ఎద్దులనీ...అరె,,రే వెన్నెల (వెన్నల ) ముద్దలవీ......:-))
ReplyDelete......వర్మకే అందనీ అందానివో...చక్కని పల్లెవో..
వర్మాజీ.. చాలా బావుంది, keep it up.
నిజమేనండి, మీరన్నాక తెలిసింది వెన్నముద్దల్లాగే ఏ షేపూ లేకుండా ఉన్నాయి ఈ ఎద్దులు మెడల్లో కనీసం గంటలన్నా కట్టవలసింది వాటికి. పోనీలెండి ఏమిచేస్తాం అయ్యిందేదో అయిపోయింది :p
Delete