సాహిత్యాన్ని, సంగీతాన్ని, గానాన్ని, చిత్రీకరణని, నటనని, నటీనటుల అందాన్ని అన్నింటినీ సమపాళ్ళలో కలిపి ఒక అద్బుతమైన పాటని చేస్తే ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అని చెప్పగలం? అలాంటి అరుదైన పాటల్లో ఒకటి సాగరసంగమంలో మౌనమేలనోయి అనేది.
అప్పుడప్పుడే స్నేహం ప్రేమగా మారుతున్న తరుణం, వాళ్ళిద్దరూ మనుష్యులుగా దగ్గరగా ఉన్నా, మొహమాటాల సుధీర తీరాల్లో ఉన్నవాళ్ళు. వెన్నెలరాత్రి, ఎక్కడినుంచో గాలితో పాటూ తేలివస్తున్న మధురమైన ఎస్.జానకి గానం, రాతిరధం దగ్గర అద్దాల్లాంటి నాపరాళ్ళమీద ప్రతిఫలిస్తున్న వాళ్ళ రూపాలు. ఇళయరాజా ఆర్కెష్ట్రైజేషన్, వేటూరి సాహిత్యం.
నిశ్సబ్ధంలో అంతర్ముఖం అవుతుంటే అతను చెపుతాడు `వెళతానని`. ఆమె ముఖకవళికలు చూడండి.
పరధ్యానం, మనసులో మెదిలే భావాలని గమనించుకోవడం, మౌనాన్ని మనసు భాషలోనికి అనువదించుకోవడం.. ప్రతీభావాన్నీ జయప్రద ఎంతబాగా వ్యక్తీకరించిందో.
మౌనమేలనోయి….మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలా
ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
పలికే పెదవి వణికింది ఎందుకో
వణికే పెదవి వెనకాల ఏవిటో
కలిసే మనసులా విరిసే వయసులా (2)
నీలి నీలి ఊసులు లేత గాలి బాసలు
ఏమేమో అడిగినా..మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
హిమమే కురిసే చందమామ కౌగిట
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట
ఇవి ఏడడుగులా వలపు మడుగులా (2)
కన్నె ఈడు ఉలుకులు కంటి పాప కబురులు
ఎంతెంతొ తెలిసినా..మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో
ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
© Dantuluri Kishore Varma
అక్షరాలా అవును.
ReplyDeleteనిజానికి మౌనానికి ఉన్నంత స్వేచ్చా, స్పష్టతా మాటకు లేదు..
కొన్ని భావాలకు, భాషలకు మాట అడ్డుకట్ట వేస్తే మౌనం తెర తీస్తుంది...
హృద్యమైన విశ్లేషణ కిషోర్ వర్మ గారు...
నా టపా కన్నా మీ కామెంటే ఎక్కువ పోయెటిక్‌గా ఉంది జానీ పాషా గారూ. నా బ్లాగ్‌కి మీకు స్వాగతం. ధన్యవాదాలు.
Delete