Pages

Monday, 13 January 2014

కాపీ క్యాట్స్

మీకు అనుభవంలోకి వచ్చిందో లేదో తెలియదు కానీ కాపీ క్యాట్స్ సమస్య ఎక్కువైపోయింది. ఫేస్‌బుక్కులో, బ్లాగుల్లో వీళ్ళు పెద్ద మనుషుల్లా చలామణీ అయిపోతూ ఎడాపెడా కాపీ చేసేస్తూ ఉంటారు. షేర్ అనే ఆప్షన్ ఉన్నా ఈ మట్టిబుర్రల మహాశయులకి ఇంగితజ్ఞానం ఉండదు. ఏదయినా నచ్చితే చక్కగా షేర్ చేసి ఆనందించవచ్చు. కానీ అలా చెయ్యరు. సాగరసంబరాలు మొదలయ్యాయని ఒక ఫోటోని నా వాటర్‌మార్క్‌తో సహా అప్‌లోడ్ చేస్తే, ఓ మావూరిమొనగాడు చక్కగా నాపేరు చెరిపేసి చేతివాటం ప్రదర్శించాడు. `ఏమయ్యా, ఇలాచేశావు?` అని మెసేజ్ పెడితే, అమాయకంగా `నా ఉద్దేశ్యం కాకినాడ అందాలని నలుగురికీ పంచుదామనే!` అని చిలకలా పలికాడు. `మరి వాటర్ మార్క్‌ని చెరిపెయ్యడం ఎందుకు?` అంటే, సమాధానం లేదు. 
Google image

మనరాష్ట్రం అంతా తెలిసిన ఒక మహానుభావుడి పేరుమీద ఒక ఫేస్‌బుక్ గ్రూప్ నడుపుతున్న పెద్దాయన మనకాకినాడలో బ్లాగ్‌నుంచి దేవాలయాల సమాచారం అక్షరానికి అక్షరం కాపీ చేసి గ్రూప్‌లో తనపేరుమీద పోస్టుచేసుకొన్నాడు. చూసి మతిపోయింది. సంవత్సరం పాటు ఒక్కో టపా రాస్తే, అయిదు నిమిషాలలో కాపీ-పేస్ట్ చేసి పాడేశాడు. `ఏ పేరు మీదయితే గ్రూప్ నడుపుతున్నావో, ఆయన దొంగతనం చెయ్యద్దు, అబద్దం ఆడద్దు అని చెప్పిన కొటేషన్లు చక్కగా అందరికీ పంచుతావు కదా? మరి ఇదేం పని?` అని నిలిదీస్తే అదే సమాధానం `మంచిని నలుగురికీ పంచుతున్నాను,` అని. పాటలపల్లకిలో అనే శీర్షికతో కొన్నిటపాలు రాస్తే ఓ అరవై్ఏళ్ళ గౌరవనీయుడు ఇలానే చేశారు. 

ఫేసుబుక్కుల్లోంచి ఈ దొంగతనాలు బ్లాగ్‌స్పియర్ లోకి ప్రవేశించాయి ఇప్పుడు. మావూరి పేరుమీద తియ్యని పేరుపెట్టుకొన్న ఒక బ్లాగర్ వరుసగా పోస్టులు పెడుతున్నరు. ఇక్కడ గంగిరెద్దుల పోస్టు ఉందనుకోండి - తరువాత రోజు అక్కడ ఉంటుంది; హరిదాసు ఉంటే - అదీ ఉంటుంది; సాగర సంబరాలుంటే - డిటో. ఎవరయినా వీటిగురించి రాయవచ్చు. కానీ, ఇక్కడ పోస్ట్ చేసిన వెంటనే అక్కడ వస్తుందంటే ఏమనుకోవాలి?

ఆలోచించడం రాకపోతే మత్తుగా పడుకోవాలి కానీ దొంగతనాలకి బయలుదేరతారా ఎవరయినా? 

ఇలాంటి కంప్లైంట్స్‌తో కూడుకొన్న పోస్ట్ నా బ్లాగ్ మిత్రులకి విసుగ్గా అనిపిస్తుందని తెలుసు. కానీ, కాపీరాయుళ్ళకోసం మిగిలిన అందరినీ ఇబ్బంది పెట్టక తప్పడంలేదు. వాళ్ళు ఖచ్చితంగా ఈ టపా చదువుతారని తెలుసు. చదివయినా మారకపోతారా అని ఆశ. 
© Dantuluri Kishore Varma 

10 comments:

  1. నేను కూడా ఇదివరలో ఇదే అనుభవాన్ని పొందాను . మీ సలహా కూడా తీసుకున్నాను .ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకోవాలి కానే ఇలా దొంగతనాలు చేస్తే వ్రాసుకునే స్వేచ్చని కూడా హరించినట్టే

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు ఆచార్యులుగారు.

      Delete
  2. గురువు గారు ఇప్పుడే ఆ బ్లాగు చూసాను "కాకినాడ కాజ".. మన ఊరి పేరు మీద బ్లాగు ఉందని అనంద పడి రెండు మూడు కామెంట్లు చేసాను..

    అహ్హాహా ..

    ReplyDelete
  3. మాకు కొత్త ఐడియా ఇచ్చారు... ముందు బ్లాగ్ ఎలా మొదలుపెట్టాలో రాసారు, ఇప్పుడు ఆ బ్లాగ్ లో ఏమి పోస్ట్ చెయ్యొచ్చో చెప్పారు. మాకు ఆ కాపీ కష్టం కూడ లేకుండా, మా పేరున మీరే ఎలా వ్రాయగలరో కూడ చెప్పండి. :-)

    ReplyDelete
    Replies
    1. ప్లేజురిజం గురించి నేను చెపితే, ఘోస్ట్ రైటింగ్‌కి ప్రపోజల్ పెడతారా రెడ్డిగారు? ఇదేమన్నా భావ్యంగా ఉందా? :)

      Delete
  4. కిషోర్ వర్మ గారూ,

    నమస్కారం. మీ బ్లాగు చాన్నాళ్ళనుంచి చదువుతున్నా, కామెంటడం ఇదే మొదటిసారి. చాలా చక్కటి విషయాలు క్లుప్తంగా రాస్తారు మీరు. మంచి అంశాలను ఎంచుకుని, కష్టపడి వాటిపై పరిశోధన చేసి, మీరు పదిమందితో పంచుకుంటున్న విషయాలు ఇతరులు మీకు చెప్పకుండా కాపీ చెయ్యడం చాలా దారుణం. మీరు మరీ అంత Diplomatic గా ఉండవలసిన అవసరం లేదు. ఆ సైట్లు ఏమిటో బహిరంగం చేసి వాళ్ళ గుట్టు బయట పెట్టెయ్యండి. దెబ్బకు దెయ్యం దిగి వస్తుంది :)

    చక్కటి విషయాలు అందరితో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు.

    భవదీయుడు,
    వర్మ

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రవివర్మగారు. పెర్సనల్ మెసేజ్‌లు పంపించడంతో ఒకరిద్దరు తప్పించి మిగిలిన వాళ్ళు ఈ బ్లాగ్ నుంచి కాపీ చేసిన కంటెంట్‌ని డిలీట్ చేశారు. మిగిలినవాళ్ళు కూడా కాపీరైట్స్‌ని గౌరవిస్తారనే అనుకొంటున్నాను. కాదంటే మీరన్నట్టు చేయడమే. మీ సపోర్ట్‌కి మరొక్కసారి ధన్యవాదాలు.

      Delete
  5. Replies
    1. శివరామప్రసాద్‌గారూ, మీ స్పందనకి ధన్యవాదాలండి.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!