ఏమండోయ్, ఎల్లుండి మహత్తరమైన రోజట మీకు తెలుసా? ఎందుకంటారేమిటండీ బాబూ.. రైజింగ్ నెంబరు 11.12.13. పైపెచ్చు టోటలు తొమ్మిది! వ్యాపారం మొదలు పెడితే దిన దిన ప్రవర్ధమానం అవుతుందట. పెళ్ళిచేసుకొంటే పదకొండులో రెండు ఒకట్లు ఉన్నాయి కనుక కవల పిల్లలు పుట్టడం ఖాయమట.
క్రీస్తుశకం ప్రారంభమై ఎల్లుండికి 7,35,214 రోజులు. జనవరి ఒకటి 0001 సంవత్సరాలు నుంచి డిసెంబర్ పదకొండు, రెండువేల పదమూడు వరకూ టైం అండ్ డేట్ డాట్ కాం అనే వెబ్‌సైటులో డేట్ టు డేట్ కాలిక్యులేటర్ ఉపయోగించి లెక్కిస్తే వచ్చిన సంఖ్య అది.
కాలాన్ని లెక్కించడానికి మనిషి ఏర్పాటు చేసుకొన్నది క్యాలండర్. క్రీస్తు పుట్టినదిగా భావించిన సంవత్సరం నుంచి మొదలవుతుంది. మన అందరికి తెలుసు కదా, క్రీస్తు పుట్టినరోజు క్రిస్‌మస్ డిసెంబర్ 25 అని? అంటే క్రీస్తుశకం జీసస్ పుట్టినరోజునుంచీ మొదలవలేదు. ఆ సంవత్సరంలో అంతకుముందే జనవరి ఒకటినుంచి మొదలయ్యింది. అలా ఎందుకు మొదలు పెట్టారో నాకు తెలియదు. ఎవరు మొదలు పెట్టారో అంతకన్నా తెలియదు.
కానీ...
సరదాకి చిన్న చిక్కు ప్రశ్న. 01.01.0001 శనివారం అయ్యింది. ఒకవేళ ఈ కేలెండర్ని సృష్ఠించిన వాళ్ళు ఏదో ఒక కారణం చేత అంతకు రెండురోజుల ముందు అంటే గురువారాన్ని ఈ శకం యొక్క మొదటిరోజుగా తీసుకొంటే. ఈ రోజు, ఏ తారీఖు అయ్యి ఉండేది?
ఆ.. మీరు కనిపెట్టేశారు. మీరనుకొన్నది నిజమే. క్రీస్తుశకం మొదలయ్యి ఈ రోజుకే 7,35,214 రోజులు అయి వుండేది. ఈ రోజు 11.12.13 అయ్యివుండేది!
అప్పుడు, ఎల్లుండి మహామంచి రోజనీ, అన్ని పనులూ ఆరోజే మొదలు పెట్టమనీ చెప్పే వాళ్ళంతా, వాటిని ఈ రోజే మొదలు పెట్టమని ఉండేవారు కదా?
కనుక నేను చెప్పొచ్చేది ఏమిటంటే మీరు ప్రారంభించాలనుకొనే మంచి పనుల్ని ఎల్లుండి వరకూ వాయిదా వెయ్యకుండా, ఈ రోజే దివ్యంగా మొదలు పెట్టవచ్చు. ఎల్లుండి ఎంత మంచిదో, ఈ రోజూ అంతే మంచిది. ఏమంటారు?
© Dantuluri Kishore Varma
ఎవరి పిచ్చి వారికి ఆనందం..క్రీస్తు శకానికి ముందు కాలం లేదనుకుంటా :)
ReplyDelete:) మీ స్పందనకి ధన్యవాదాలు శర్మగారు.
Deleteచాలా బాగా రాశారు, మూడనమ్మకాలపై ఆదారపడటం వల్లా నష్టం కూడా జరిగే అవకాశమూ ఉంటుంది,
ReplyDeleteమీరన్నది నిజం. ధన్యవాదాలు.
DeleteMeeru vrasina daniki comments vundavu....only compliments aaa!!!
ReplyDeleteమీరిచ్చింది చాలా పెద్ద కాంప్లిమెంట్. ధన్యవాదాలు.
DeleteLogic undi varma garuu...
ReplyDeleteధన్యవాదాలు రమేష్ గారు.
DeleteSuper sir.manam manchiga alochistey prathi roju manchi rojey
ReplyDeleteసంతోష్‌గారు మీరుచెప్పింది నిజమే. ధన్యవాదాలు.
Delete