`నేను ప్రతీవిషయంలోనూ ఖచ్చితంగా ఉంటాను,` అనుకొంటూ ఉంటారు కొంతమంది.అలా ఉండాలనుకోవడంలో తప్పులేదు. కానీ, మిగిలిన వాళ్ళు అందరూ తమలాగే ఉండాలనుకొంటేనే సమస్యలు వస్తాయి.
ఒక పెద్దాయన ఆర్థిక విషయాలలో చాలా నిక్కచ్చిగా ఉండేవాడు. బ్యాంకుల నుంచి వ్యాపారంకోసం తీసుకొన్న లోన్లుమీద వడ్డీని సరిగ్గా ఒకటవ తారీకున కట్టేవాడు. కరంటు బిల్లులు, ఫోను బిల్లులు, అద్దులు అన్నింటిలోనూ అంతే! తనకి రావలసిన బాకీల విషయంలో కూడా అలాగే అనుకొన్నా, బాకీ ఉన్నవాళ్ళు అతనంత నిబద్ధత ఉన్నవాళ్ళు కాక, లేదంటే సమయానికి డబ్బులు సర్దుబాటు కాక ఎప్పుడూ ఆలశ్యంచెయ్యడం, ఆయన వాళ్ళమీద అలిగి, అరవడం జరిగేది. రాను, రానూ ఆయన ఖచ్చితత్వం మరుగున పడిపోయి, అందరిమీదా అరుస్తాడనే అపప్రద వచ్చిపడింది.
`వాడు చూడు ఎప్పుడూ క్లాసు ఫస్టే! నువ్వూ ఉన్నావు ఎందుకు?` `సచిన్ తెండూల్కర్ పదహారేళ్ళకే అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చేశాడు. నీకు పాతికేళ్ళు వచ్చినా స్థిరత్వం రాలేదు.` ఇలా చెప్పడంవల్ల ఆమాటలు విని ఆచరించాలనుకొనేవారికి మానసికవొత్తడి పెరుగుతుంది. మంచిని పెద్దవాళ్ళూ, శ్రేయోభిలాషులూ కాక మరెవరు చెపుతారు? కాకపోతే మరెవరినో ఉదాహరణగా చూపించి అలా ఉండడమే సరైన పద్దతి అనడం అభిలషణీయం కాదు. చెప్పినవాళ్ళు నిజంగా మంచికోసం చెప్పినా ఎదుటివారిలో మార్పు తీసుకొని రావడం అటుంచి, వాళ్ళకి విరోదులు కావడం జరుగుతుంది.
మన సామర్ధ్యం, విజయం, అందం, బలం, ప్రవర్తన, ఆర్ధికవెసలుబాటు మనవే. అవి మిగిలినవారికంటే ఎక్కువో, తక్కువో అయి ఉండవచ్చు. మనం పైమెట్టుమీద ఉన్నప్పుడు `నన్నందుకో,` అని ఆయా విషయాలలో తక్కువగా ఉన్నవాళ్ళకి సవాలు చెయ్యడం. క్రిందమెట్టుమీద ఉన్నప్పుడు పైనున్న వాళ్ళను చూసి న్యూనత ఫీలవ్వడం రెండూ తప్పే!
ఎదుటివారి విజయాలని చూసి స్పూర్తిపొంది ముందడుగు వెయ్యాలికానీ, మనం చెయ్యలేకపోతున్నాం అని స్ట్రెస్‌ఫీలవ్వకూడదు. అన్నీ అనుకూలించి, విజయం మన సొంతమైతే - ఇంకా విజయంకోస ప్రయత్నిస్తున్న తోటి వాళ్ళకి వొత్తడి పెంచకూడదు. ఎవరి అనుకూలతలు, ప్రతికూలతలూ వారివే. ఒకరికి, ఇంకొకరితో పోలికే లేదు. మనకున్న ప్లస్ పాయింట్లలో పెర్ఫెక్ట్ అయితే, మైనెస్ పాయింట్లలో ఇంపెర్ఫెక్టే కదా? అందరికీ అన్నీ ప్లస్ పాయింట్లే ఉండవు కదా?
© Dantuluri Kishore Varma
Well said
ReplyDeleteThank you Niru garu!
Deleteసున్నితంగా చెప్తే ఎవరైనా స్పూర్తిగా తీసుకుంటారు.
ReplyDeleteబాగుంది మీ ఆశాజనక టపా. వర్మాజి
ధన్యవాదాలండీ!
DeleteI m perfectly imperfect
ReplyDeleteహ.. హా.. శర్మగారు. ఇంటరెస్టింగ్!
Deleteబాగా చెప్పారు.
ReplyDeleteధన్యవాదాలు శిశిర గారు. చాలా కాలానికి మీ రాక..
Delete