Pages

Thursday, 5 December 2013

మీరెప్పుడైనా ప్రేమలోపడ్డారా?

ప్రేమంటే తెలియని వాళ్ళు ఆంధ్రదేశంలో ఉండరు. కాళిదాసు ప్రబంధాల నుంచి కృష్ణశాస్త్రి కవితలవరకూ వరకూ, యద్దనపూడి సులోచనారాణి నవలల నుంచి యండమూరి వీరేంధ్రనాథ్  ప్రేమకథల వరకూ చదివేసి, ఒక్కోసారి చదవకుండానే ప్రేమలో పడదామనుకొనేవాళ్ళు, పడినవాళ్ళు, పడి లేవనివాళ్ళు, పడి భంగపడినవాళ్ళు , ప్రేమసముద్రాన్ని ఈదినవాళ్ళు, ఒక్క అడుగు వేసి అదే సముద్రమని భ్రమపడేవాళ్ళు కలిసి ఇంచుమించు విభజించని ఆంధ్రప్రదేశ్  జనాభాఅంత ఉంటారు. కాదూ, కూడదు, నేను ఒప్పుకోను అని మీరంటే ఆ సంఖ్యలోనుంచి ఒకటి తీసివేసి లెక్కించుకోండి.
తొలిచూపుల్లో
దోరనవ్వుల్లో
మధురభాషణల్లో
కవ్వింపుచేష్టల్లో
ప్రేమ...

ఆలస్యాలలో
అలకల్లో
బుంగమూతుల్లో
బుజ్జగింపుల్లో
ప్రేమ...

అనువుకాని అపార్ధాలలో
విరహపు ఎదురుచూపుల్లో
ఘాడపు నిట్టూర్పుల్లో
విదిల్చే కన్నీటిచుక్కల్లో
ప్రేమ...

కలిసి విడిపోతే ప్రేమ..
విడిపోయి కలిస్తే ప్రేమ..
ఒకజంట ప్రేమకథ మీకు చెపుదామని ఈ ఊపోధ్గాతం. నచ్చకపోతే రేపటి పోస్టు చదవకండి. నచ్చితే మరచిపోకుండా రేపు ఇక్కడే చూడండి... 
© Dantuluri Kishore Varma

10 comments:

  1. Upload your latest photo. I am in love with you.

    ReplyDelete
    Replies
    1. మీపేరన్నా లేకుండా నా లేటెస్ట్ ఫోటోలు అడగడం పద్ధతిగా ఉందా?

      Delete
  2. daaaaaaaaaaaarcy, hope you will mention him too in your post. :)

    ReplyDelete
    Replies
    1. Thank you Sunitha garu. Keep your fingers crossed until the article appears! :)

      Delete
  3. రేపటి మీ కథ కొసం చూస్తూ,

    ReplyDelete
    Replies
    1. స్టోరీ ఈస్ కమింగ్. స్టే ట్యూన్‌డ్ మెరాజ్ గారు :)

      Delete
  4. Replies
    1. అనంతకృష్ణ చైతన్యగారు, ఇదేమన్నా భావ్యంగా ఉందా? వెరైటీగా రాయమని నన్ను టెన్షన్ పెడుతున్నారు.

      Delete
  5. చాలా బావుంది కిషోర్ గారు, రేపు ఇక్కడే చూస్తాం మరి...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు. ఆల్రెడీ రాశాను కరుణ గారు. పై పోస్టులో చివర తరువాతి భాగానికి లింక్ ఇచ్చాను. `ఇక్కడే` అన్నచోట క్లిక్ చెయ్యండి.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!