Pages

Friday, 6 December 2013

ప్రైడ్ అండ్ ప్రెజుడీస్‌

గర్వం, మిగిలిన వాళ్ళకంటే తానేదో గొప్పవాడినన్న అహంకారం అతనికి. ఆ విషయం ఆమె గమనించింది. అవమానకరమైన సంగతి ఏమిటంటే `చూడటానికి పరవాలేదు కానీ, అందగత్తె ఏమీకాదు,` అని ఆమె గురించి అతను స్నేహితుడితో చెప్పడం స్వయంగా విన్నది. తొలిచూపులో ప్రేమకాదు కదా, కనీసం ఒకరిమీద ఒకరికి సదాభిప్రాయం కూడా లేకుండానే ప్రపంచపు గొప్ప ప్రేమజంటల్లో ఒకటిగా గుర్తింపబడ్డారు వాళ్ళు. నూటముప్పై   సంవత్సరాలక్రితం 1883లో జేన్ఆస్టిన్ అనే బ్రిటిష్ రచయిత్రి రాసిన నవల ప్రైడ్ అండ్ ప్రెజుడీస్‌లో డార్సీ, ఎలిజబెత్‌లు ప్రేమించుకొని, తిరస్కరించుకొని, అపార్ధాలు చేసుకొని చివరికి ఒకటై ఇప్పటికీ పాఠకుల మనసులు దోచుకొంటూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా డార్సీ లాంటి ప్రేమికుడికోసం ఎదురుచూసే అమ్మాయిలు ఎంతమందో!

ఐదుగురు అక్కచెల్లెళ్ళలో ఎలిజబెత్ రెండవది. పెద్ద అమ్మాయి జేన్. నవల ప్రధానంగా వీళ్ళిద్దరి ప్రేమ కథల చుట్టూ తిరుగుతుంది.  వీళ్ళు మిష్టర్ అండ్ మిసెస్ బెన్నెట్‌ల పిల్లలు. లండన్ దగ్గర మెరిటన్ అనే ఊరు వాళ్ళది. నవల కోసం జేన్ఆస్టిన్ సృష్టించిన ఊరు అది.  ఆడపిల్లలకి పెళ్ళిల్లు చేసి పంపించాలని మనసమాజంలో తల్లితండ్రులు ఎంత తాపత్రయపడతారో, ఎక్కడో ఇంగ్లండ్‌లో కూడా అలాంటి పరిస్థితులే గమనిస్తాం ఈ నవలద్వారా. ఆస్థిపాస్తులున్న, అందగాడైన కుర్రాడు దొరికాడంటే తమ ఇంటి అల్లుడ్ని చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అందరూ. కాకపోతే మన సంస్కృతిలో లేని పార్టీలూ, బాల్‌డ్యాన్స్‌లు ఆధ్యంతం ఈ కథలో కనిపిస్తాయి. అమ్మాయిలూ, అబ్బాయిల పరిచయాలు పెరగడానికి, ప్రేమలుగా మారడానికి ఇవే వేధికలుగా ఉంటాయి.

బింగ్లే అనే ధనవంతుడైన కుర్రాడు ఆప్రాంతానికి అద్దెకు వచ్చి బంగ్లాలో స్థిరపడటంతో ఆడపిల్లల తల్లుల మధ్య పోటీమొదలౌతుంది. బింగ్లే స్నేహితుడు డార్సీ. అప్పుడే ఒక బాల్‌లో ఎలిజబెత్, డార్సీల మధ్య మొదటిపరిచయం, పరస్పర వికర్షణ(?) ఏర్పడతాయి.

కానీ, అదే ఎలిజబెత్ అక్క జేన్, బింగ్లేల మధ్య ఆకర్షణకలిగే సన్నివేశం . అది క్రమంగా ప్రేమగా మారుతుండగా డార్సీ చిన్న పొరపాటు చేస్తాడు. తనస్నేహితుడు బింగ్లే - జేన్ పైన చూపించే ప్రేమంత, ఆమె తిరిగి ఇవ్వటంలేదని అతనికి అనిపిస్తుంది. అదే స్నేహితుడికి చెపుతాడు. వాళ్ళమధ్య దూరానికి కారకుడౌతాడు.

కథాక్రమంలో డార్సీ ఎలిజబెత్ అంటే ఇష్టపడడం మొదలుపెడతాడు. కానీ, ఆమెకి అతనంటే పడదు. కారణం సుస్పష్టం. స్వంత అక్క ప్రేమలో అతనే విలన్ మరి! దానికితోడు వికం అనే వికెడ్(చెడ్డ) వ్యక్తి వాళ్ళమధ్యకి వస్తాడు. అందంగా కనిపించే మోసగాడు. డార్సీమీద ఎలిజబెత్‌కి లేనిపోనివి కల్పించి చెప్పి ఆమె మనసులో మరింత ఏహ్యభావం కలిగిస్తాడు. 2005లో వచ్చిన హాలీవుడ్ సినిమా ప్రైడ్ అండ్ ప్రెజుడీస్‌లో డార్సీ మొదటిసారి ఎలిజబెత్‌కి ప్రపోజ్‌చేసే సీన్ చూడండి. ఆమె తిరస్కరించినప్పుడు డార్సీ కళ్ళల్లో కనిపించిన భావం చూడండి.

డార్సీ ఆవూరినుంచి వెళ్ళిపోతాడు. వికం ఎలిజబెత్ చెల్లెల్ని తీసుకొని పారిపోవడంతో వాళ్ళని వెతికి పట్టుకొని, వికంని వొప్పించి వాళ్ళీద్దరికీ పెళ్ళిచేస్తాడు డార్సీ. బెన్నెట్‌ల కుటుంభ గౌరవాన్ని కాపాడతాడు. కానీ, ఈ విషయం ఎలిజబెత్‌కి తెలియదు. కథ చివరికి వస్తుంది. డార్సీ ప్రవర్తనలో కూడా ఎంతో మార్పు వస్తుంది. గర్వం స్థానే ఇతరులని అర్థం చేసుకోవడం మొదలౌతుంది. డార్సీ చేసిన సహాయం విషయం ఎలిజబెత్‌కి తన ఆంట్‌ద్వారా తెలుస్తుంది. తనగురించే చేశాడని ఆమె మనసుకి తెలుసు. డార్సీ ఆమెకి రెండవసారి తన ప్రేమని వ్యక్తం చేస్తాడు. ఇప్పుడు ఆమెకి తిరస్కరించడానికి ఏ కారణంలేదు.

జేన్, బింగ్లేలు కూడా కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. ఇలాంటి కథలు ఎన్నో మనం యద్దనపూడి సులోచనారాణి లాంటి రచయిత్రులు రాయగా చదివాం. అందుకే కథగా మనకి కొత్తదనం ఏమీ అనిపించక పోయినా కథనం, పాత్రలని మలచడం, ఇంగ్లాండ్‌లో అప్పటి జీవనవిధానాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించగలగడం, అన్నింటికంటే ప్రధానంగా జేన్ఆస్టిన్ రచనా శైలి నాకు ఈ నవల నచ్చడానికి కారణాలు. ఇది నవలా విశ్లేషణ కాదు. కేవలం కథా పరిచయం మాత్రమే. నవలని ఆధారంగా చేసుకొని నిర్మించిన సినిమా లేవీ నేను చూడలేదు. కానీ, ఈ రెండు క్లిప్పింగ్‌లూ చూసినతరువాత చిక్కని ప్రేమకథని మీ అందరితో పంచుకోవాలనిపించి ఇది రాశాను. నవల డౌన్‌లోడ్ చేసుకొని చదవ వచ్చు. ఇక్కడ చూడండి.

ఈ నవలా పరిచయానికి నిన్నటి ఉపోధ్గాతం ఇక్కడ చదవండి.
© Dantuluri Kishore Varma

10 comments:

  1. ఇంగ్లీష్ వారి 17 వ శతాబ్దపు యద్దనపూడి సులోచనారాణి అనవచ్చునేమో జేన్ ఆస్టిన్ ని. కొన్నాళ్ళకిందట తెలుగు లో "ప్రియురాలు పిలిచింది" అనే డబ్బింగ్ సినిమా వచ్చింది.అది బహుశా ఈమె రాసిన Sense and Sensibility" కి అనుసరణ మాదిరిగా అనిపించింది. All the best ..well written!

    ReplyDelete
    Replies
    1. యుద్దనపూడినే ఈ శతాబ్ధపు ఆస్టిన్ అంటే బాగుంటుందేమో! మీ స్పందనకి ధన్యవాదాలు మూర్తిగారు.

      Delete
  2. felt happy kishore garu :) not that I guessed it right, but for getting an opportunity to see such beautiful write up on this great piece of work. and those two scenes are you posted are best in the movie. Keira Knightley & Matthew Macfadyen made a great pair for these eternal characters. especially Matthew Macfadyen as Darcy as you mentioned in your post is awesome :)

    ReplyDelete
    Replies
    1. Sunitha garu, I felt highly flattered with your response. I suppose you have got a very good knowledge of hollywood movies and that of English fiction. Really surprised to notice that you had been able to name the character on seeing the actor`s still from Pride and Prejudice movie in my previous post. :)

      Delete
    2. :) Thanks to Management (my discipline), that I could manage to, feel you that way, only with the limited awareness I have on the subject area. :D Jokes apart, It's only an infatuation I developed towards Jane Austen's work at one point of time that made me go through all most all the versions of pride & prejudice with the exception of Gurinder Chadha's work. Some how it did n't give me the feel of authenticity. Just my opinion. and from all those who played Darcy Matthew Macfadyen stood best as per me. though an English Actor well accepted by Hollywood for the role. And when your post is about this work may be it's that infatuation made me write all this. Hope I did n't bore you. try to see this 2005 version some time if possible. I guess you will like it. and coming to your blog, I feel I am lucky to have landed here. It has everything and all that too in Telugu. It's so beautifully crafted Kishore garu. Best wishes to you and your blog. Good day

      Delete
    3. మన తెలుగు కథలకి, వారి కథల్కీ పోలిక ఉన్నా , సినిమా అనేసరికి వారు సహజత్వానికే ప్రాదాన్యత ఇస్తారు.
      మీ ప్రత్నానికి అభినందనలు.(సినిమా తీసే ఉద్దేస్యమేమైనా ఉందా వర్మాజి ?)

      Delete
    4. Though I am not as avid a reader as yourself, I too am a book lover Sunita garu. So, there is no question of feeling bored when it comes to reading and related matters. Thanks indeed!

      Delete
    5. డబ్బులు నష్టపోవడానికి సిద్దంగా ఉన్న నిర్మాత ఎవరూ దొరకడం లేదు మెరాజ్ గారు. అందుకే, ప్రస్తుతానికి నా సినిమా చూసే ప్రమాదం మీకు తప్పినట్టే. :)

      Delete
  3. సరే సర్. మీ సినిమాకై మేము ఎదురుచూస్తాం!

    "ప్రైడ్ అండ్ ప్రెజుడీస్‌" చాలా బాగుంది. మీరు ఇలా రాసుకుంటూ పోతే, మేము చాలా ఇంగ్లీష్ సినిమాలు చూడాల్సి వస్తుంది. :-)

    ReplyDelete
    Replies
    1. రెడ్డిగారూ, మీరే నిర్మాత! :D

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!