సంవత్సరంన్నరక్రితం ఈ బ్లాగు మొదలుపెట్టినప్పటి నుంచీ మనకాకినాడకి సంబంధించిన ఎన్నో టపాలని రాయడం జరిగింది. `మనకాకినాడలో` అనే పేరు చూసి, ఆశగా ఇక్కడికి వచ్చే పాఠకులు మన ఊరితోఉన్న మధురమైన అనుబంధం గురించి తలచుకొనేలా, జ్ఞాపకాలని గుర్తుతెచ్చుకొనేలా కొన్ని ఆర్టికల్స్ ఉండవచ్చు. కొత్తసంవత్సరం దగ్గర పడుతుంది కనుక అటువంటి వాటిల్లో ఆణిముత్యాల్లాంటి ఒక ఇరవై టపాలని ఎంచి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతీ ఆర్టికల్‌నీ సూచించే సబ్‌హెడ్డింగ్ పైన క్లిక్ చేస్తే పూర్తి టపాను చదవవచ్చు. మరింత సమాచారం సేకరించి, ఇక్కడ పొందుపరచడానికి కావలసిన ఉత్సాహం మీ కామెంట్స్‌ద్వారా అందుతుందని గమనించండి. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
1. సండే మార్కెట్:
సండే మార్కెట్ అంటే…
పేదవాడి అన్ బ్రాండెడ్ బట్టల షాప్
మధ్య తరగతి షాపింగ్ మాల్
చిన్నపిల్లల తీర్తం
బుక్ లవర్ల స్వర్గం
స్రుజనాత్మక వస్తువులు అమ్మే బూటీక్
కార్లలో వచ్చి ఆగడానికి సిగ్గు పడే సంత
2. సర్పవరం శ్రీభావనారాయణ స్వామి దేవాలయం:
ఇక్కడ స్వయంభూగా వెలసిన పాతాళ భావనారాయణ స్వామికూడా ఉంది. ముగ్గురు మూర్తులున్న దీనిని త్రిలింగ క్షోణి వైకుంఠము అంటారు. శ్రీ కృష్ణదేవరాయల తండ్రి వసంతభోగరాయలు నిర్మించిన మండపం ఈ దేవాలయంలో ఉంది. ఈ విషయం ఇక్కడి శాశనాల వల్ల తెలుస్తుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడంవల్ల 108 నారాయణ క్షేత్రాలు దర్శించిన ఫలితం వస్తుందని చెబుతారు.
3. గోకులం:
2 ఎకరాల విశాలమైన స్థలం
పచ్చని చేట్లు మరియు లాన్లు
దశావతారాలు, అష్టలక్ష్ములు
శ్రీకృష్ణ లీలలు, ధ్యాన మందిరం
సభావేదిక, చుట్టూ వాకింగ్ ట్రాక్
శ్రీకృష్ణ బృందావనం – మధురానగర్ లో గోకులం.
4. వాకలపూడి లైట్ హౌస్:
కాకతీయుల కాలం నుంచీ కాకినాడ ఒక ప్రధానమైన తీరప్రాంతంగా ఉండేదట. తరువాత ఈస్ట్ఇండియా కంపెనీ భారతదేశంలో వాణిజ్య కార్యకలాపాలు మొదలుపెట్టినప్పుడు, 19వ శతాబ్ధం మధ్యలో రంగూన్ నుంచి, మచిలీపట్టణం వరకూ చాలా రేవు పట్టణాలలో ఆగుతూ వెళ్ళే స్టీమరు సర్వీసుని ఏర్పాటుచేసింది. మధ్యలో ఆగే రేవుపట్టణాలలో కోకనాడ ఒకటి.
5. వ్యవసాయ, ఫల, పుష్ప ప్రదర్శన(ఎగ్జిబిషన్):
పదిరూపాయల టిక్కెట్టు కొని లోపలికి వెళితే ఏముంటుందో అందరికీ తెలుసు. ఇది మా వూరికి పెద్ద తీర్థం. 37 సంవత్సరాలనుంచి, పెద్దగా మార్పు లేకుండా అవేస్టాల్స్ పెడుతున్నా, కాకినాడలో సరదాగా కుటుంబంతో గడపడానికి కావలసిన ప్రదేశాలు ఎక్కువగా లేవుకనుక, ప్రతీసారీ సినిమాకే పోలేకా ఎగ్జిబిషన్‌కి దారితీస్తారు మా నగరవాసులు.
6. ఆదికుంభేశ్వర స్వామి దేవాలయము:
రావణా బ్రహ్మ రాజనీతిజ్ఞుడు, వీరుడు, బలశాలి, సకల వేదవేదాంగ పండితుడు అన్నింటినీమించి శివ భక్తుడు. ఎన్నో సుగుణాలు ఉన్నా, కొన్ని అవలక్షణాల వల్ల సర్వనాశనం కావడం మనం రావణుడి నుంచి నేర్చుకోవలసిన పాఠం. రావణాసురుని అసలు పేరు దశగ్రీవుడు లేదా దశకంఠుడు. అంటే పదితలలు కలవాడు అని అర్ధం. నేను గొప్పవాడిని అన్న అహంతో శివుడు తప్పస్సు చేసుకొంటున్న పర్వతాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తున్న రావణుడికి బుద్దిచెప్పడానికి శివుడు పర్వత శిఖరం మీద తనబొటనవేలితో అదుముతాడట. ఆ వొత్తడికి నలిగిపోయిన దశకంఠుడు బాధతో రోధిస్తాడట. అప్పటినుంచే అతనికి బాధతో రోదించేవాడని అర్ధం ఇచ్చే రావణుడు అని పేరు వచ్చింది అంటారు. ఆ సంఘటన తరువాత రావణుడు పరమ శివభక్తుడు అవుతాడు. ఈ కథని గుర్తుకు తెచ్చేలా దశగ్రీవుడి తలలమీద నిలచిన శిఖరంతో ఆదికుంభేశ్వరుడి దేవాలయం మనకి కాకినాడ బీచ్‌రోడ్‌లో కనిపిస్తుంది.
7. రాజా పార్క్:
రాజా పార్కుని మొదటిలో కుళాయి చెరువు అని పిలిచేవారు. నగరానికి నీటి అవసరాలని తీర్చే అతిపెద్ద చెరువు ఇది. విశాలంగా ఉన్న గట్టు మీద, చెరువు ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో వ్యవసాయ ఫల పుష్ప ప్రదర్శన అని పిలవబడే ఎగ్జిబిషన్‌నీ ప్రతీసంవత్సరం నిర్వహించేవారు. ఇప్పుడు ఈ ఖాళీ స్థలాన్ని వేరుచేసి, చెరువు ప్రాంతాన్ని మాత్రం రాజా పార్క్(వివేకానందా పార్క్) గా అభివృద్ది చేశారు.
8. ఇంకొక్క పెసరట్టు!:
కాకినాడ మెయిన్‌రోడ్ నుంచి జగన్నాధపురం వంతెనవైపుగా వస్తున్నప్పుడు, గోల్డ్‌మార్కెట్ సెంటర్ దగ్గర కుడిచేతివైపు మంత్రిప్రగడవారి వీధిలోనికి తిరిగి ముందుకు వెళ్ళండి. బాగా ముందుకి వెళితే దేవాలయం వీధికి వెళ్ళిపోతారు. వద్దు! అంతవరకూ వెళ్ళడం అనవసరం. కొంచెం నె...మ్మ...దిగా కదలండి. ఆ))) చూశారా, రోడ్డుకి రెండువైపులా వరుసగా బజ్జీ బళ్ళు, పిడతకింద పప్పు, రాజస్థానీవాళ్ళ పానీపూరీ, పావుబాజీ, చపాతీ బళ్ళు....వాటి దగ్గర బైకులమీద, స్కూటర్లమీద, సైకిళ్ళమీద, కార్లలో, నడిచీ వచ్చిన ఫాస్ట్‌ఫుడ్ ప్రియులు ఎంతోమంది ఆవురావురుమని మిరపకాయ బజ్జీలనీ, కళాత్మకంగా పానీపూరీల్నీ తినడం కనిపిస్తుందికదా? నోరు ఊరుతుంది, అవునా? ఆగండాగండి. తొందరపడి ఎదో ఒకటి కొనేసుకోకండి. ఒక్క నాలుగడుగులు....
9. సీతారాముల గుడి:
ఈ దేవాలయంలో ఉన్న ఇంకొక విశేషం ఏమిటంటే శ్రీరామ పరివారపు ఉత్సవ విగ్రహాలు అన్నీ ఉన్నాయి. సాధారణంగా సీతారామలక్ష్మణులు, ఆంజనేయుడూ మాత్రమే ఉంటాయి. కానీ, భరతశతృగ్నులు, విభీషణుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు మొదలైన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ విశేషం గురించి చెపుతూ వంశపారంపర్య అర్చకుడు ఇచ్చిన సమాచారం ఏమిటంటే - గుడిని నిర్మించే సమయంలో కాకినాడ సముద్రతీరంలో ఒక ఓడ ఒడ్డుకు చేరిపోయిందనీ, దానిలో దేవాలయానికి సంబంధించిన అర్చన సామాగ్రి సమస్తం ఒక భోషాణంలో ఉందని గుడిని నిర్మించినాయన స్వప్నంలో శ్రీరాముడు కనిపించి చెప్పాడట. వెళ్ళిచూస్తే నిజమే! పెట్టెలో ప్రస్తుతం గుడిలో ఉన్న శ్రీరామ పరవారం యొక్క విగ్రహాలు, పూజా సామాగ్రీ, గంటతో సహా లభించాయట.
10. సినేమా:
హంస పాలనీ, నీళ్ళనీ విడగొట్టగలిగినట్టు వీళ్ళు భక్తినీ, రక్తినీ విడగొట్టారు. ఎలాగా అంటారా? టౌన్‌లో మెయిన్ రోడ్‌కి సమాంతరంగా అటుఒకటి, ఇటుఒకటీ రోడ్లు ఉంటాయి. ఒకదానిలో ఈచివరినుంచి, ఆచివరివరకూ ఎన్నో దేవాలయాలు ఉంటాయి. అందుకే దాన్ని దేవాలయం వీధి అంటాం. ఇక రక్తి విషయానికి వస్తే - దానికి కూడా ఒక ప్రత్యేకమైన రోడ్డు వుంది. ఇంతకు ముందు చెప్పాను కదా రెండుసమాంతరమైన రోడ్ల గురించి? ఆ రెండవదే జనాలకి వినోదం కలిగించేది. పేరు సినిమా వీధి. ఒకటి, రెండు సినిమా హాళ్ళు మినహా మిగిలినవన్నీ ఇదే వీధిలో ఉండేవి. అప్పటికప్పుడు అనుకొని సినిమాకి బయలుదేరినా, వరసగా థియేటర్లన్నీ ఒక్కొక్కటీ చూసుకొంటూ వెళితే, ఎక్కడో ఒకచోట టిక్కెట్లు దొరికేవి.
11. పిండాల చెరువు దగ్గర త్రిపురసుందరి గుడి:
గుర్రపుడెక్కతో, తామరాకులతో అసలు నీరుందని కూడా తెలియనంతగా నిండిపోయి ఉండేది పిండాల చెరువు. అప్పుడప్పుడూ గుర్రపుడెక్క అంతా తొలగించి శుభ్రం చేసేవారు. కానీ, మధ్యలో ధ్యానముద్రలో ఉన్న శివుడి విగ్రహాన్ని కట్టి, చెరువు చుట్టూ గోడకట్టి, లోపల పార్క్ అభివృద్ది చేసిన తరువాత మొత్తం ఆ రోడ్డుకే అందం వచ్చింది.
12. జిల్లా కేంద్ర గ్రంధాలయం:
జిల్లాకేంద్ర గ్రంధాలయాన్ని 1952లో ప్రారంభించారు. కాకినాడ మెయిన్‌రోడ్‌లో ఉంది. పెద్దభవనం, విశాలమైన రీడింగ్‌రూంలు, మంచి ఫర్నీచర్, వివిధ సబ్జెక్టమీద 83,000 గ్రంధాలతో పుస్తకప్రియులని చేతులు చాచి ఆహ్వానిస్తుంది. 72 రకాల పత్రికలని తెప్పిస్తున్నారు. పోటీపరీక్షలకి వెళ్ళే విద్యార్ధులకి అవసరమైన వివిధరకాల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. అంతే కాకుండా గంటకి కేవలం పదిరూపాయలు చెల్లించి అంతర్జాలాన్ని ఉపయోగించుకోగల సదుపాయంతో ఇంటర్నెట్ విభాగాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
13. మన కాకినాడ (అదే పదివేలు):
సముద్రపువొడ్డున ఉన్న పల్లె లాంటి పట్నం, పట్నం లాంటి పల్లె. అక్కడక్కడా నీటికొలనులు. వాటినిండా ఎర్ర తామర పువ్వులు. బాలాజీ చెరువు, సంతచెరువు, పిండాలచెరువు, కుళాయి చెరువు, ఇంకా చాలా చెరువులు వాటిపేర్లు కూడా మనకు తెలియకుండా కప్పెట్టేసినవి...
14. ఓ అందమైన అమ్మాయి ఆత్మకథ:
గోదావరి జిల్లాల ప్రజలు స్నేహశీలురు, గౌరవమర్యాదలు తెలిసున్నవాళ్ళు. అలాగని అమాయకులని మాత్రం అనుకోవడానికి వీలులేదు. `ఆయ్` అని మర్యాద చూపిస్తూనే, తమమర్యాద ఏమైనా తగ్గుతుందని భావిస్తే చమత్కారంగా మాటకి మాట అప్పజెప్పగల చతురులు. ఏ పరిస్థితులలో అయినా నెగ్గుకురాగల వ్యవహారధక్షత కూడా వీళ్ళకు ఎక్కువే. "ఏమిటి, గోదావరి వాళ్ళ వకాల్తా పుచ్చుకొన్నట్టు, అంతలేదు, ఇంతలేదు అని కోతలు కోస్తున్నావ్? వాళ్ళకేనా సుగుణాలు? ఇంకెవరికీ ఉండవా?" అని వాదనకి రావద్దు.
15. కాంక్రిట్ జంగిల్ లో జీవనవైవిధ్యం:
సెంట్రల్ జూ అధారిటీచే మినీ జూగా గుర్తింపబడిన కే.వీ.కే రాజు సుందరవనం ఎన్.ఎఫ్.సీ.ఎల్ గ్రీన్ బెల్ట్ లో ఉంది.
16. గాంధీ మందిరం:
గాంధీగారు కాకినాడ వచ్చిన సందర్భానికి గుర్తుగా 1950 లో గాంధీ మందిరం నిర్మించారు, తరువాత పాత భవనం స్థానంలో 2008లో ప్రస్తుతం ఉన్న భవనాన్ని నిర్మించారు.సాంబమూర్తి నగర్ ఓవర్ బ్రిడ్జికి దగ్గర, మునిసిపల్ ఆఫీస్ వెనుకవైపు `గాంధీ మందిరం` ఉంది.
17. స్టేట్ బ్యాంక్ హెరిటేజ్ గేలరీ:
మెయిన్ రోడ్లో స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వెనుకవైపు (శ్రీకాంప్లెక్స్ రోడ్ లోకి వస్తుంది)2011 ఫిబ్రవరి 9న ఈబిల్డింగ్ లో స్టేట్ బ్యాంక్ హెరిటేజ్ గేలరీని ప్రారంభించింది.
18. సరస్వతీ విద్యా పీఠం:
ఋషి, పర్ణశాల, నిశభ్దం నీకూ నాకు మధ్య, ఆనందోబ్రహ్మ, ప్రేమ... లాంటి మంచి టేస్ట్ మరియు భావుకత్వం కలిపి రాసిన నావల్స్ యండమూరి వీరేంద్రనాధ్ యొక్క ప్రత్యేకతని తెలియజేస్తాయి. అదే ప్రత్యేకతతో ఆయన నెలకొల్పిన సరస్వతీ విద్యా పీఠం సామర్లకోట రోడ్డులో మాధవపట్నం దగ్గర ఉంది.
19. కాకినాడ బీచ్:
సముద్రం నుంచి నేల వైపు చూస్తే గుబురుగా పెరిగిన సర్వీతోట, లైట్ హౌస్. కిలో మీటర్ల కొద్దీ వ్యాపించినట్టు కనిపిస్తున్న తీరం, ముఖ్యంగా కెరటాలు వచ్చి తాకుతున్న తడి ఇసుక, దానిమీద లంగరువేసి ఉన్న నావలు. తనివి తీరని అందాల్ని మాటల్లో వర్ణించాలంటే, ఎవరి గురించో చెప్పలేనుకానీ, నాకు మాత్రం సాధ్యంకాదు.
20. ఇంకా చాలా ఉన్నాయి:
మన ఊరిలో విశేషాలకి కొదవలేదు. అందుకే, మనకాకినాడలో బ్లాగ్‌ని ఎల్లప్పుడూ చదువుతూ ఉండండి. మన ఊరితో మీకున్న అనుబంధాన్ని, మీ జ్ఞాపకాలని, అనుభూతులని కామెంట్ల రూపంలో ఇక్కడ అందరితో పంచుకోండి.
© Dantuluri Kishore Varma
వామ్మో... ఆ ఊరు ఎంత అదృష్టం చేసున్నదో కదా,
ReplyDeleteమీ ప్రతి మాటలోనూ మీ వూరి గొప్పే, మీ వంటి బిడ్డని కన్న మీ ఊరు నిజంగా గొప్పదే..
కానీ... మీరు కొంచెం పొగిడారు మెరాజ్ గారూ :)
Deleteమీ అభిమానానికి ధన్యవాదాలు.
Good post.
ReplyDeletemadhuri.
Thanks a lot for the appreciation :)
DeleteNice Post Varma Garu, Meeru Kakinada gurinchi wrastunte chala anandamga undi.
ReplyDeleteVeda Srinivas.
మీకు నచ్చడం సంతోషదాయకం. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.
DeleteIf you are an unmarried young man, do not go to Kakinada - otherwise, you face the danger of getting married to one of the well educated and pretty girls of Kakinada. Five of my seven brothers, including me, were clean bowled in this town! Of course, this happened some four decades ago or so. Great town any day!
ReplyDeleteSo sweet!
Deletekeep it up sir,amazing telugu blog ever
ReplyDeleteThanks a lot Feroz garu.
Deleteవర్మ గారు, మీ బ్లాగ్ కు. నేను ఫిదా అయిపోయాను.......చాలా విషయాలు కాల మానాలతో సహా సరిగ్గా వ్రాస్తున్నారు...నేను కూడా కాకినాడ వాసినే....కానీ మాకు తెలియని కొన్ని సంగతులు దీని ద్వారా తెలిసాయి....చాలా కృతజ్ఞతలు....ఇప్పుడ్డిప్పుడే కాకినాడ జనాభా పెరిగిపోతుంది....వీటిలో చాలా విషయాలు భవిష్యత్తులో మారే అవకాశం ఉంది. ఇది ఒక మరపు రాని జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
ReplyDeleteమీ అభినందనకి ధన్యవాదాలు వెంకట రామారావు గారు.
Delete