Pages

Sunday, 15 December 2013

గోదాదేవి తిరుప్పావై

తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో మదురైకి 75కిలోమీటర్ల దూరంలో కొండలనుడుమ శ్రీవిల్లిపుత్తూరు అనే ఊరిలో రంగనాధస్వామి దేవాలయం 108 గొప్ప విష్ణుక్షేత్రాలలో ఒకటి.  సుమారు ఎనిమిదవ శతాభ్దపు కాలంలో(A.D.) దేవాలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న విష్ణుచిత్తుడికి పూలతోటలో ఒక పసిపాప దొరికింది. ఆమే ఆండాళ్. విష్ణుచిత్తుడు పెంచుకొన్నాడు.

ఆండాళ్ గొప్ప విష్ణుభక్తురాలు. అప్పటి ఆచారం ప్రకారం బాల్యవివాహం చేయ సంకల్పిస్తే నిరాకరించింది. మనసునిండా పాండురంగడిని  నింపుకొని, ఆయననే పరిణయమాడాలని తలచింది. తండ్రి ప్రతీరోజూ రంగనాధునికి అలంకరించడానికి పూమాలను తయారుచేస్తే, ముందు తానే ధరించేది. కొన్నిరోజులకు ఆ విషయం విష్ణూచిత్తుడికి తెలిసి ఆమెని మందలిస్తాడు. ఆమె ధరించిన మాలని విడిచి పెట్టి, మరొకటి అల్లి, రంగనాధుడికి సమర్పిస్తాడు. కానీ పాండురంగడికి అది నచ్చక ముఖం చిన్నబుచ్చుకొన్నాడట. తనకి ఆండాళ్ ధరించిన మాలనే అలంకరించమని ఆదేశించాడట.  


యుక్తవయస్సు వచ్చేసరికి పాండురంగడిని పరిణయమాడాలని వ్రతం చేసింది. దీనిలో భాగంగా ముప్పై పాశురాలు రచించి, రోజుకి ఒకటి చొప్పున పాడుతూ తిరుప్పావై వ్రతం చేసింది.  ముప్పయ్యవరోజు పాండురంగడు, ఆండాళ్‌ని వివాహంచేసుకొన్నాడట. ఆరోజునే బోగి అంటారు. ఆండాళ్‌నే గోదాదేవి అని కూడా అంటారు. ఆమె తమిళంలో రాసిన ముప్పై పాశురాలని కలిపి తిరుప్పావై అంటారు.  

పండుగనెల(ధనుర్మాసం) ప్రారంభమైన రోజునుంచి (ఈ సంవత్సరం ధనుర్మాసం రేపు అంటే పదహారవ తేదీన ప్రారంభమౌతుంది) గోదాదేవి పాడిన పాశురాలని రోజుకొకటి చొప్పున విష్ణుక్షేత్రాల్లో వినిపిస్తారు.  వాటిని వినడం వల్ల, పాడడంవల్ల విశేషమైన పుణ్యం లభిస్తుందని చెపుతారు.
*     *     *
మార్గశిర మాసం. విష్ణాలయాలు భక్తి, ఆధ్యాత్మికతలతో శోభాయమానం అయ్యే కాలం ఇది. ముగ్గులతో, పుష్పాలతో దేవాలయాలని అలంకరిస్తారు. తిరుప్పావై పాశురాలని ఆలపిస్తారు. వివరణలు చెపుతారు. మంచుకురిసే వేళల్లో ఆ అలంకారాలను చూడడం, పాశురాలని వినడం ఎంతో బాగుంటుంది.

గోదాదేవి ఆలపించిన పాశురాలన్నీ తమిళంలో ఉన్నాయి. వాటిని యధాతదంగా గానం చేస్తారు. తెలుగు లిపిలో రాసుకొన్నా, తమిళభాష రాని నాలాంటి వారికి వాటిని చదవడం ఇబ్బంది. అర్థం తెలియదు. ఇక శృతిలో పాడుకోవడమంటే ఈ జన్మలో అయ్యే పనికాదు. కానీ, విజ్ఞులు అందరూ తిరుప్పావైలో ఉన్న మప్పై పాశురాల గొప్పతనం గురించి చెపుతుంటే చదవి అర్థం చేసుకోవాలని మనసు లాగుతుంది. 

నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. బహుశా వాళ్ళకోసమేమో, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎప్పుడో 2000వ సంవత్సరంలో పాశురాలకి ఇంగ్లీషులో వివరణ జతచేసి ఒక చిన్న బుక్‌లెట్ విడుదల చేశారు. చక్కని బొమ్మలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇంటర్నెట్ సౌలభ్యం కారణంగా యూట్యూబ్ వీడియోలు చూడగలగడం, ప్రవచనాలు వినగలగడం చేస్తున్నాం. 

ధనుర్మాసం మొదలైంది కనుక వాటన్నింటినీ అనుసంధానం చేసుకొంటే ఆండాళ్ రోజుకొక్కటిగా పాడిన పాశురాలన్నీ, మనం కూడా రోజుకొక్కొక్కటి వింటూ, అర్థం చేసుకొంటూ ఆస్వాదించవచ్చు! నిత్యశ్రీ మహదేవన్ అనే గాయని తమిళ్‌లో పాడిన పాశురాలని నాలుగు, ఐదు వాటిగా కలిపి యూట్యూబ్‌లో ఉంచారు. మొదటి నాలుగు పాశురాల వీడియోని ఇక్కడ ఇస్తున్నాను. వీడియోకి క్రింద తెలుగు లిపిలో ఉన్న పాశురాలు, వాటికి క్రింద శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు తిరుప్పావై గురించి వివరంగా చెప్పిన ప్రవచనాల లింకు ఇస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ బుక్‌లెట్‌లో ఇచ్చిన బొమ్మలు కూడా ఉన్నాయి. 



1.పాశురము

మార్గళి త్తిజ్ఞ్గల్ మది నిరైన్ద నన్నాళాల్ 
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిలైయీర్ 
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్ 
కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్ 
ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్ 
కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్ 
నారాయణనే నమక్కే 
పరైతరువాన్ పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).
2.పాశురము

వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు 
చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్ 
పై యత్తు యిన్ర పరమనడిపాడి 
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి 
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్ 
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్రోదోమ్ 
ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి 
ఉయ్యు మారెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).
3.పాశురము.

ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్పాడి 
నాంగళ్ నమ్బావైక్కు చ్చాట్రి నీరాడినాల్ 
తీంగన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు 
ఓంగు పెరుమ్ శెన్నెల్ ఊడు కయలుగళ 
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప 
తేంగాదే పుక్కిరున్దు శీర్ త్తములై పట్రి 
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్బశుక్కళ్ 
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).
4.పాశురము

ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్ 
ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేరి 
ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు 
పాళియందోళుడై పర్పనాబన్ కైయిల్ 
ఆళిపోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్రదిరిన్దు 
తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్ 
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్ 
మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్

వివరణ(ఇది లింకు. క్లిక్‌చేసి చదవండి).

తిరుప్పావై మిగిలిన పాశురాలని ఇక్కడ వినండి:

  1. తిరుప్పావై - 5,6,7,8 పాశురాలు
  2. తిరుప్పావై - 9 - 22 పాశురాలు
  3. తిరుప్పావై పాశురాలు 23 - 30 
© Dantuluri Kishore Varma 

10 comments:

  1. Namaskaram!


    Devulapalli garidi Telugu Tiruppavai undi. veelaite chadavandi.

    Subhakankshalato
    Sreedevi

    ReplyDelete
    Replies
    1. ప్రయత్నిస్తాను శ్రీదేవిగారు. ధన్యవాదాలు.

      Delete
  2. ఈ ధనుర్మాస దీక్ష లో మీతోపాటు మమ్మల్ని కూడా భాగస్వామ్యులను చేసినందుకు కృతజ్ఞతాభివందనాలు. మీ ప్రయత్నం సఫలీకృతం కావాలి. నమస్తే.

    ReplyDelete
    Replies
    1. వెంకటలక్షిగారు, -^- ధన్యవాదాలు.

      Delete
  3. Replies
    1. I must thank you for your kind feed back Reddy garu. Thanks a million.

      Delete
  4. baagundi mee sEkarana, abhinandaneeyam

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మెరాజ్ గారు. కొంచం బిజీగా ఉండడంవల్ల మీ కామెంటుకి చాలా ఆలస్యంగా స్పందించాను. మరోలా భావించకండి.

      Delete
  5. ప్రతి ఏటా ఈ ధనుర్మాసవ్రతాన్ని ఆచరిస్తుంటాను.మనం ఆచరించటమే కాదు పదిమందికి దాని గురించి తెలియచెప్పాలనే మీ భావన చాలా మంచిది. జై శ్రీమన్నారాయణ!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ఆచార్యులుగారు. ఇష్టంతో పాశురాలని వినడం, చదివి తెలుసుకోవడం తప్పించి వ్రతం అవీ చెయ్యడంలేదండి :)

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!