కాకినాడనుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో, యానం వెళ్ళేరోడ్డులో జామికాయలతూము ఉంది. అది ఒక ఊరిపేరు. అక్కడినుంచి కొంచెంలోపలికి వెళితే జి.వేమవరం ఊరిలోకి వెళతాం. అక్కడే శ్రీ జియర్‌స్వామి వారి ఆశ్రమం ఉంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరంగ రామానుజ జీయర్ స్వామివారిది ఇది. ఆశ్రమంతోపాటూ వేదపాఠశాల కూడా నిర్వహిస్తున్నారు. సుమారు ఆరు సంవత్సరాలక్రితం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని చాలా అద్భుతంగా నిర్మించారు ఇక్కడ.
ఎత్తైన గాలిగోపురం, దానికి అభిముఖంగా ఉత్తరద్వార గోపురం, ఈ రెండింటికీ మధ్యలో గరుత్మంతుని మందిరం ఉన్నాయి. గాలిగోపురంలోనుంచి లోనికి ప్రవేశిస్తే, విశాలమైన ప్రదేశంలో వేంకటేశ్వరస్వామివారి దేవాలయము, ఎదురుగా ధ్వజస్థంభము, దానికి ఎడమవైపున శ్రీరంగ మండపము ఉన్నాయి.
పదకొండు అడుగుల ఎత్తైన మందస్మిత వేంకటేశ్వరస్వామి వారి విగ్రహం చాలా బాగుంది. స్వామికి రెండువైపులా ప్రత్యేక మందిరాలలో ఆయన దేవేరులు ఉంటారు.
గుడిని, పరిసరాలనీ చాలా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. దేవాలయానికి చుట్టూ వనాన్ని పెంచుతున్నందువల్ల, ట్రాఫిక్‌కి చాలా.. దూరంగా ఉండడంవల్ల ప్రశాంతతకు పట్టుకొమ్మలా ఉంటుంది.
బాగుంది కదా? అవకాశం ఉంటే తప్పక చూడండి.
© Dantuluri Kishore Varma
mee sontha ooru jagannaghagiri or tanumalla kadu kada
ReplyDeleteమా మేనమామగారిది పెనుమళ్ళ. ఆ రెండు ఊళ్ళకీ మధ్యనే!
Deleteఎంత ఓపికా..మీకు ఆ వెంకన్న్న అండదండలు ఉంటాయి ఎప్పుడూ,
ReplyDeleteధన్యవాదాలు మెరాజ్ గారు.
Delete