Pages

Thursday 26 December 2013

స్వరమే రాగం కదా

1981లో విడుదలైన ఆకలి రాజ్యం సినిమా ఒక సెన్సేషన్. పెద్ద మ్యూజికల్ హిట్. ఎం.ఎస్.విశ్వనాధన్ స్వరకల్పన చేసిన పాటలన్నీ ఒకదానిని మించి ఒకటి అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పాట నా ఫేవరెట్. జానకి స్వరం నిజంగా కోయిల కూసినట్టు మధురాతి మధురంగా ఉంటుంది. అలాగని బాలు గాత్రం ఏమీ తగ్గిందని కాదు. పాట రచన : ఆచార్య ఆత్రేయ. 
నాయికా, నాయకుల మధ్యపోటీ. ఈ పాటే ఒక తమాషా ప్రయోగం. బాణీకి పాటను రాయడం ఎలానో చూపించారు. 

ఒక శ్రీశ్రీ ఆరాధకుడు అమ్మాయి కళ్ళను చూస్తూ ప్రేమ పాట పాడటం కూడా విశేషమే! అమె తాళం పాడితే, అతను `అహా` అని మైమరచిపోతాడు. అతను స్వరాలు కూరిస్తే `చాలా బాగుందని` ఆమె సౌంజ్ఞ చేసి చెపుతుంది. ఒకరి గొప్పతనం మరొకరికి తెలిసే పోటీపడడం!  `దననీ దససా అన్నా నీదా అన్నా స్వరమే రాగం కదా` అని పాటను కూరుస్తూనే `నీవు నేననీ అన్నా మనమే కాదా` అని ముక్తాయింపు ఇచ్చి, తనమనసులో మాట చెప్పకనే చెప్పాడు. ఇలాంటి తెలివితేటలున్న కుర్రాడిని ఏ అమ్మాయి అయినా వదులుకొంటుందా?


తన్న తన్ననన తన్న తన్ననన తన్నాన ననన తనతన తన్నాన

ఓహో... కన్నెపిల్లవని కన్నులున్నవని

ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ

లల్లలల్లలల లల్లలల్లలల లల్లల లల్లల లాలలాల లాలాలా

చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి

ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ

కన్నెపిల్లవని కన్నులున్నవని

ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ

చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి

ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ

ఏమంటావ్... ఊఁ...

ఉహుఁ... సంగీతం

నన్నానా... ఉఁ... నువ్వైతే

రీసరి... సాహిత్యం ఊహుఁ... నేనౌతా

సంగీతం నువ్వైతే సాహిత్యం నేనౌతా

కన్నెపిల్లవని కన్నులున్నవని

ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ

చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి

ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ



ననననాన సే ఇట్ వన్స్ ఎగైన్

ననననాన... స్వరము నీవై...

తరనన తరరనన స్వరమున పదము నేనై ఓకే

తానే తానే తానా... గానం గీతం కాగా

తరనతన కవిని నేనై

తానా ననన తనా... నాలో కవిత నీవై

నాన నాననా లలలా తనన తరన

కావ్యమైనదీ తలపో పలుకో మనసో

కన్నెపిల్లవని కన్నులున్నవని

ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ

చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి

ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ

సంగీతం నువ్వైతే సాహిత్యం నేనౌతా



ఇప్పుడు చూద్దాం...

తనన తనన తన్న

ఉహూ... తనన తనన అన్నా

తాన తన్న తానం తరనా తన్న

తాన అన్న తాళం ఒకటే కదా

తనన తాన తాన నాన తాన అయ్య బాబోయ్

తనన తాన తాన నాన తాన ఉహ్...

పదము చేర్చి పాట కూర్చలేదా శ భాష్

దనిని దససా అన్నా నీదా అన్నా

స్వరమే రాగం కదా

నీవు నేనని అన్నా మనమే కాదా

నీవు నేనని అన్నా మనమే కాదా

కన్నెపిల్లవని కన్నులున్నవని

కవిత చెప్పి మెప్పించావే గడసరి

చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి

కలిసి నేను మెప్పించేది ఎపుడని

కన్నెపిల్లవని కన్నులున్నవని

కవిత చెప్పి మెప్పించావే గడసరి

చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి

కలిసి నేను మెప్పించేది ఎపుడని

ఆహాహా లలల్లా ఆహాహా...
© Dantuluri Kishore Varma 

2 comments:

  1. ఔను, ఆత్రేయ, బాలచందర్ కాంబినేషన్ అద్భుతం.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు బోనగిరిగారూ.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!