ఆడవారి మాటల్ని అర్థం చేసుకోవాడానికి కొత్త పుస్తకం వచ్చింది అంటే పరుగెత్తుకెళ్ళాడట ఒక పెద్దమనిషి. చూస్తే ఏముంది! బ్రిటానికా ఎన్సైక్లోపీడియా కంటే పెద్ద పుస్తకాల సెట్‌ని చూసి ఈసురోమని ఇంటిదారి పట్టాడు. మగవాళ్ళు ఆడవాళ్ళకి; ఆడవాళ్ళు మగవాళ్ళకీ అర్థంకాకపోవడం సృష్టిప్రారంభంనుంచే ఉందట. అందుకే, వాళ్ళమధ్య చక్కని సయోధ్య కుదిర్చే దిశగా `మెన్ ఆర్ ఫ్రం మార్స్ విమెన్ ఆర్ ఫ్రం వీనస్` లాంటి పుస్తకాలు ఈ మధ్యన రావడం మొదలు పెట్టారు.
`నేను బాగానే ఉన్నాను, థాంక్స్!` అని ఆమె విసురుగా అందంటే, నిజానికి బాగున్నట్టు కాదట!
ఒక అమ్మాయి, ఒక అబ్బాయిని `ఎంతమంది ఉన్నారేంటి గాళ్ ఫ్రెండ్స్ మీకు?` అని ఆటపట్టించడానికి అడిగినట్టు అడిగితే - నెంబరు చెప్పమని కాదు. `నాకు నీతో స్నేహం చెయ్యడం ఇష్టమే సుమా,` అని అట!
అలాగే - `నాకు ఫేస్‌బుక్‌లో ఎంతమంది అబ్బాయిలు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతున్నారో చూడండి,` అని ఒక ఇల్లాలు భర్త దగ్గర అంటే - వెంటనే ఈర్ష్యతో ఎగరమని కాదు. `నీకేంటి, ఎన్నయినా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తాయి,` అనే పొగడ్త ఇస్తే బాగుంటుందని.
ఆమె మాట్లాడిన మాటల డిక్ష్నరీ అర్థాలని బట్టి కాదు, ఆమె మనసు తెలుసుకొని మాటలని స్వీకరించాలి అంటారు. `ఆడవారిమాటలకి అర్థాలు వేరని` సరదాగా ఆటపట్టిస్తే, ఆమె ఉడుక్కోవడం కూడా చాలా బాగుంటుంది. కావాలంటే చూడండి అప్పుడెప్పుడో ఎన్.టీ.రామారావు, ఆ తరువాత పవన్ కళ్యాణూ అదే చేశారు.
1955లో రిలీజయిన మిస్సమ్మ సినిమా. పాట సాహిత్యం పింగళి నాగేంద్రరావు. సంగీతం సాలూరి రాజేశ్వరరావు. పాడినవారు ఏ.ఎం.రాజా.
2001 లో రిలీజయిన పవన్‌కళ్యాణ్ సినిమా ఖుషీలో అప్పటి మిస్సమ్మ పాటని రీమిక్స్ చేసి ఉపయోగించారు. సంగీతం మణిశర్మ, పాడినవారు మురళీ.
అవునంటె కాదనిలే కాదంటె అవుననిలే(2)
ఆడువారి మాటలకి అర్థలే వేరులే
అర్థాలే వేరులే అర్థలే వేరులే
అలిగి తొలగి నిలిచినచో
చెలిమి చెయ్యి రమ్మనిలే
చొరవ చెసి రమ్మనుచో (2)
మర్యదగ పొమ్మనిలే
ఆడువారి మాటలకి అర్థలే వేరులే
అర్థాలే వేరులే అర్థలే వేరులే
విసిగి నసిగి కసిరినచొ (2)
విషయం అసలు ఇస్తమెలే
తరచి తరచి ఊసడిగిన (2)
సరసం ఇంక చాలని లే
ఆడువారి మాటలకి అర్థలే వేరులే
అర్థాలే వేరులే అర్థలే వేరులే
అవునంటె కాదనిలే కాదంటె అవుననిలే(2)
ఆడువారి మాటలకి అర్థలే వేరులే
అర్థాలే వేరులే అర్థలే వేరులే
© Dantuluri Kishore Varma
అవునూ.. ఈ పొస్ట్ రాయటములో మీ ఉద్దేస్యం ఏమిటీ..:-)
ReplyDeleteమెరాజ్‌గారు ఇది పోట్లాట కాదు కదా? :)
Deleteపింగళిగారు ఉద్దేశ్యమే నాది కూడా. ఆయన అలా చెపితే, నేను ఇలా చెప్పాను అంతే - `ఆమె మాట్లాడిన మాటల డిక్ష్నరీ అర్థాలని బట్టి కాదు, ఆమె మనసు తెలుసుకొని మాటలని స్వీకరించాలి` అని.
అయినా సరే నాకు నచ్చలేదు...( అర్దం వేరే కదా... ఆడవారి మాటకి అర్దం వేరు అంటే నచ్చిందనే కదా:-)) అర్దం చేసుకోరూ,
Deleteఅయినా మగవారి మాటలకు అర్దాలే లేవులే..
ఓహో అలాగంటారా? అయితే వాకే! ధన్యవాదాలు.
Delete