ఆదిశంకరాచార్యులని సాక్షాత్తూ పరమశివుని అవతారంగా భావిస్తారు. క్రీస్తుశకం 788వ సంవత్సరంలో కేరళలో కలాడి అనే ఊరిలో నంబూద్రి బ్రాహ్మణుల ఇంటిలో ఆర్యాంభ, శివగురు అనే దంపతులకి బిడ్డగా జన్మించాడు. పుట్టిన కొన్నిరోజులకే తండ్రి చనిపోవడంతో, ఈతనిని తల్లే పెంచుతుంది. ఉపనయనం అయినతరువాత బ్రహ్మచారిగా సనాతన ధర్మాన్ని అనుసరించి ఇంటింటికీ తిరిగి బిక్ష గ్రహించాలి. బాలుడిగా ఉన్న ఆదిశంకరాచార్య ఒక పేదమహిళ ఇంటి దగ్గర ఆగుతాడు. కానీ, పాపం ఇవ్వడానికి ఆమెకి ఇంటిలో ఏమీలేదు ఒక ఎండిపోయిన ఉసిరికాయ తప్ప. దానినే బిక్షగా ఇస్తుంది. అప్పుడు, ఆమె దయకి, కరుణకి ముచ్చటపడి కనకధారాస్తోత్రం చదివి లక్ష్మీదేవిని ప్రసన్నంచేసుకొని, ఆ పేదరాలికి సంపదని ఒనగుర్చమని కోరతాడు. లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల వర్షం ఆ యింటిలో కురిపిస్తుంది. ఆ కుర్రవాడియొక్క గొప్పతనం అది. ఆదిశంకరాచార్యులు అత్యంత తెలివితేటలు కలిగిన బాల మేధావి. శంకరాచార్యుని విధ్వత్తు ఎంతగొప్పది అంటే, ఒకసారి తల్లి నదిదగ్గరనుంచి నీరు తీసుకొనివస్తూ అవస్థలు పడడం గమనించి, ఆనదినే ప్రవాహమార్గం కొంచెం మార్చుకొని తమ ఇంటిప్రక్కగా వెళ్ళవలసిందని అడుగుతాడు. అలాగే జరుగుతుంది!
సన్యాసం స్వీకరించి గురువుకోసం అన్వేషణ మొదలుపెడతాడు. ఎన్నో వేలకిలోమీటర్లు కాలినడకన తిరుగుతూ చివరికి నర్మదానది ఒడ్డున శ్రీ గోవింద భగవత్పాదుల వారిని చేరతాడు. గురువుకి సేవలు చేస్తూ అన్ని విద్యలూ నేర్చుకొంటాడు. తరువాత గురువుగారి ఆజ్ఞమేరకు వారణాసి వెళతాడు. అక్కడ ఎంతో మంది ఆదిశంకరాచార్యునికి శిష్యులుగా మారతారు. ఒకరోజు శిష్యులతో కలసి వెళూతున్నప్పుడు ఒక చంఢాలుడు ఎదురు వస్తాడు. శంకరాచార్యులు వాడిని ప్రక్కకి తొలగమని అడిగినప్పుడు, వాడు తొలగవలసినది ఈ శరీరమా, లేక ఆత్మా? అని ప్రశ్నిస్తాడు. ఆకాశం యొక్క ప్రతిబింబం గంగానదిలోనూ, కల్లుకుండలోనూ కనిపిస్తుంది. రెండింటిలోనూ కనిపించే ఆకాశం ఒకటేనా, లేక వేరు వేరా? అని అడుగుతాడు. ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని తెలియజేసిన చంఢాలునికి ఆదిశంకరాచార్యుడు ప్రణమిల్లుతాడు. అప్పుడు చంఢాలుని రూపంలో ఉన్న పరమశివుడు నిజరూపంలో ప్రత్యక్షమై వ్యాసుడు కూర్చిన బ్రహ్మసూత్రాలకి వాఖ్యానం రాయవలసినదిగా ఆదేశిస్తాడు. పరమశివుడు ఆదేశాలను నిర్వర్తించడానికి బదరీకి వెళతాడు. ప్రస్థానత్రయం అని పిలువబడే బగవద్గీత, ఉపనిషత్తులు,బ్రహ్మసుత్రాలమీద భాష్యం రాస్తాడు. తిరిగి కాశికి వస్తాడు. అప్పటికి ఆయన వయసు 16 సంవత్సరాలు.
శంకరాచార్యులవారి ప్రియశిష్యుడు సనందనుడు. ప్రియశిష్యుడికి కావలసిన అన్ని అర్హతలూ అతనికి ఉన్నా, అందరికీ ఆతనిమీద అసూయగా ఉంటుంది. దానిని తొలగించడానికి ఒకరోజు ఆదిశంకరాచార్యుడు ఒక చిన్న తమాషా చేస్తాడు. నదికి ఇవతలి ఒడ్డున గురువు, అవతల ఒడ్డున శిష్యుడు ఉండగా తక్షణమే ఇటు రావలసిందని పిలుస్తాడు. వెంటనే సనందనుడు నదిలోని నీటిమీద పాదాన్ని వేసి అవతలి ఒడ్డుకు ప్రయాణం మొదలుపెడతాడు. పాదం నీటిలో మునగకుండా ఒక కలువపువ్వు పైకి లేస్తుంది. అడుగడుగుకీ ఒక్కో పువ్వుచొప్పున పువ్వులదారి ఏర్పడి ఆ పరమశిష్యుడికి నదిని దాటడానికి సహాయం చేస్తుంది.
ఆదిశంకరుడు బోధించిన మతం అద్వైతం. దేశం ఆ చివరినుంచి ఈ చివరివరకూ ప్రయాణంచేసి ఎందరో విద్వాంసులని తర్కంలో, మీమాసంలో ఓడించి నాలుగు దిక్కుల్లోనూ నాలుగు మఠాలను స్థాపిస్తాడు. తూర్పున పూరీలో, పశ్చిమాన ద్వారకలో, ఉత్తరాన బద్రీనాథ్లో, ధక్షిణాన శృంగేరీలో. సనాతనధర్మాన్ని దేశంలో మూలమూలలా వ్యాపింపచేయడానికి, వేదవిజ్ఞానాన్ని ప్రజలకి అందించడానికి ఒక్కో వేదాన్ని ఒక్కో పీఠానికి అప్పగిస్తాడు. ఋగ్వేదాన్ని పూరీకి, యజుర్వేదాన్ని శృంగేరీకి, సామవేదాన్ని ద్వారకాకి, అదర్వణవేదాన్ని బదరీనాథ్‌కీ అప్పగిస్తాడు.
శివనందలహరి, సౌందర్యలహరి, విష్ణుశహస్రం లాంటి ఎన్నో స్త్రోత్రాలు రచించాడు. కైలాసగిరినుంచి పంచలింగాల్ని తీసుకొనివచ్చి అయిదుచోట్ల - కేదార్‌లో ముక్తిలింగాన్ని, నేపాల్ నీలకంటదేవాలయంలో పరలింగాన్ని, చిదంబరంలో మోక్షలింగాన్ని, శ్రంగేరీలో భోగలింగాన్ని, కంచిలో యోగలింగాన్ని ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించారు.
ముప్పైరెండవఏట శివసాన్నిధ్యాన్ని చేరారు.
At Kotipalli Temple |

© Dantuluri Kishore Varma
baga raasaaru raaju gaaru.. mee blog ni eppudu anusaristuu vuntaanuuu
ReplyDeleteధన్యవాదాలు. మీబ్లాగ్ చూశాను. బాగుంది.
DeleteOh. Ok. That was my daughters blog. Ravi Khandavilly
Deleteఅయ్యా కిషోర్ వర్మగారూ! మీ టపాతో నా జన్మ ధన్యమైంది... ఈ రోజు ఉదయం బ్రహ్మశ్రీ చాగంటివారు మాటీవీలో శంకరభగవత్పాదులవారిని గూర్చి చెపుతూ ఉంటే ఈరోజు ఎలాగైనా వారిగురించి నెట్ ద్వారా తెలుసుకోవాలని అనుకున్నాను. కానీ ఇప్పటివరకూ మర్చిపోయాను. ఇపూడు మీ టపాతో స్వామివారే నాకు గుర్తిచేసినట్లయింది.. అంతా భగవత్ లీల.. కృతజ్ఞతలు
ReplyDeleteశ్రీనివాస్ గారు ధన్యోస్మి!
Deleteకిషోర్ వర్మగారూ, టపాలు బాగుంటున్నాయి. ఇలా ప్రతి సారి చెప్పించుకొనేలా వ్యవహరిస్తున్నారు. అభినందనలు. ప్రతి రోజు, తొలుత, మీ బ్లాగ్ టపా కోసమే యత్నిస్తాను. ఇది అతిశయోక్తి కాదు ...
ReplyDeleteవెన్నుతట్టి ముందుకు నడిపించేలాంటి కామెంట్ పెట్టారు ప్రసాదరావుగారు. ధన్యవాదాలు.
Delete