సినిమాపాటల్లో కవిత్వమేమిటీ అని అడుగుతారు కొంతమంది. కానీ, ఈ పాటలో చూడండి, కవిత్వం ఎంత చక్కటి హొయలుపోతుందో. ప్రేమించిన పిల్లదానికి మనసులోమాట సూటిగా చెప్పలేక రకరకాల ప్రయత్నాలు చేస్తారు కొందరు అబ్బాయిలు. అలాంటి ప్రయత్నమే ఇది కూడా. అరమరికలు లేకుండా నోరుతెరచి మాట్లాడమంటున్నాడు. తను చెప్పవలసింది చెప్పకుండా ఇదిగో ఇలా-
మనసున తొణికే మమకారాలు
కనులను మెరిసే నయగారాలు
తెలుప రాదటే సూటిగా
తెరలు తీసి పరిపాటిగా
పలుకరాదటే చిలుకా పలుకరాదటే
అనికూడా కవిత్వం వొలకబోస్తాడు. ఇది సముద్రాల రాఘవాచారి రాసిన పాట. ఘంటసాల సంగీతం, గానం. 1950లో విడుదలైన షావుకారు సినిమాలోది ఈ పాట.
ఈ పాటలో నేను గమనించిన ఇంకొక విశేషమేమిటంటే ఎన్.టీ.ఆర్ ని పాట అంతా చాలా భాగం క్లోజప్‌లోనే చూపించినా ఒక్క క్షణం కూడా కెమేరావైపు చూడడు. హిందీ హీరో మనోజ్ కుమార్ కి అలాంటి అలవాటు ఉండేదని చెపుతారు.
పలుకరాదటే చిలుకా పలుకరాదటే
సముఖములో రాయబారమెందులకే
పలుకరాదటే చిలుకా పలుకరాదటే
ఎరుగని వారమటే
మొగ మెరుగని వారమటే
పలికిన నేరమటే
పలుకాడగ నేరమటే
ఇరుగు పొరుగు వారలకే
అరమరికలు తగునటనే
పలుకరాదటే చిలుకా పలుకరాదటే
మనసున తొణికే మమకారాలు
కనులను మెరిసే నయగారాలు
తెలుప రాదటే సూటిగా
తెరలు తీసి పరిపాటిగా
పలుకరాదటే చిలుకా పలుకరాదటే
© Dantuluri Kishore Varma
చక్కని పాటను గుర్తు చేశారు. షావుకారు సినిమాలో సముద్రాల సాహిత్యం... అబ్బ ఎంత బాగుంటుందో. ఎన్టీఆర్-షావుకారు జానకిలపై చిత్రించిన మూడు పాటలు (పలుక రాదటే; పలుక వేలనే; ఏమనెనే) ఎంత ఆహ్లాదంగా, హాయిగా ఉంటాయో. మాధవపెద్ది సత్యం స్వరంలో ఇంతేనన్నా; మారిపోవురా కాలం అనే రెండు బిట్ సాంగ్స్ కూడా చక్కగా ఫిలసాఫికల్ గా జీవిత, ప్రకృతి సత్యాలను విడమరిచేవిగా ఉంటాయి. Thanx for remembering nice songs from such a nice movie!
ReplyDeleteధన్యవాదాలు నాగరాజ్ గారు.
Delete