Pages

Friday, 22 November 2013

దేవదేవుడు తడిసి ముద్దవుతున్నాడు, ఎవరూ గొడుగు పట్టకండి!

జగన్నాధపురం ప్రధానరహదారి. నిత్యం జనం-
వాహనాల పొగ, కాలుష్యం  పైకి లేస్తూ ఉంటాయి.
కళ్ళల్లో, ఇళ్ళకప్పులమీద, షాపుల అద్దాలమీద దుమ్మూ దూళీ పడుతూ ఉంటుంది.
దానికేమి తెలుసుపాపం ఇదే దారిలో రెండు దేవాలయాలు ఉన్నాయని-
ఎత్తైన గాలిగోపురాలు ఊరికే అందమైనవని, వాటిమీద పడకూడదని!

విష్ణాలయం, శివాలయాల అందమైన గోపురాలు దూళికొట్టుకుపోయాయి.
ఎన్నికుండల నీళ్ళు వేసి కడిగితే శుభ్రపడతాయి?
వాటికి అభిషేకం చెయ్యాలంటే నీటిని మేఘాలతో తేవాలి.
చినుకు చినుకుగా వర్షం మొదలైంది.
రాత్రంతా గాలి, వానా..
రోడ్లు, ఇళ్ళు, షాపులు అన్నీ తడిసిపోయాయి వాటితోపాటూ గాలిగోపురాలుకూడా.
వర్షం ఇంకావస్తుంది. దేవదేవుడు తడిసి ముద్దవుతున్నాడు. ఎవరూ గొడుగు పట్టకండి.
విష్ణాలయం

శివాలయం
© Dantuluri Kishore Varma 

4 comments:

  1. చాలా బాగుంది.ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం కాకినాడ లొ చదువుకున్నప్పుడు చూసాను. చాలా అందమైన ప్రశాంతమైన నగరం.భానుగుడి. అక్కడ తిన్న కాజాలు .ఇంజినీరింగ్ కాలేజి దగ్గర గుడిసె విలాస్ లొ మిరపకాయ్ బజ్జీలు ఇంకా నొట్లొ నీరూరిస్తున్నాయి. Thanks a lot for reminding me of such a beautiful days.

    sreerama

    ReplyDelete
    Replies
    1. మధురమైన పాతరోజులు జ్ఞాపకంచేసుకొని ఆనందిస్తున్నారంటే నాకూ ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.

      Delete
  2. Replies
    1. ధన్యవాదాలు వెంకట అప్పారావు గారు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!