Pages

Thursday, 21 November 2013

అదిగో...ఉంది!

ఇండిబ్లాగర్ అనే బ్లాగర్ఆగ్రిగేటర్ ఉంది తెలుసు కదా?
వాళ్ళు తరుచూ బ్లాగ్‌టపాల పోటీ పెడుతుంటారు.
ఆ మధ్యన ఆంబీపురా అనే పెర్‌ఫ్యూముల కంపెనీ వాళ్ళది స్మెల్లీ టూ స్మైలీ అనే పోటీ ప్రకటించారు. 
వాసనలకి సంబంధించో, పరిమళాలకి సంబంధించో మన జ్ఞాపకాలని వాళ్ళతో పంచుకోవాలి. 
నేను కూడా ఒక టపా రాశాను - 
మూడువందల వాటిల్లో నాదొకటి. 
బహుమతులు ఎప్పుడు ప్రకటించారో తెలియలేదు. కానీ, ఈ రోజు అనుకోకుండా వాటిని చూశాను. 
మొదటి ప్రైజు, రెండవ ప్రైజుల్లో నా పేరులేదు(ఆశకి అంతుండాలి! వచ్చేస్తుందనే!)
`అరవై వెయ్యిరూపాయల ప్రైజులు. ఇక్కడ క్లిక్కండి,` అని ఉంది.
ఆశ చావదు కదా! 
క్లిక్కి చూశాను, స్క్రోల్ డౌన్ చేశాను.
అదిగో...ఉంది!
బ్లాగులు రాయడం బొత్తిగా కాలక్షేపం ఒక్కటే కాదండోయ్. అప్పుడప్పుడూ డబ్బులు కూడా వస్తాయన్న మాట!
మనకి బహుమతి వచ్చిందో, లేదో తెలియకపోవడానికి కారణం ఏమిటంటే - వాళ్ళేమీ మనకి మెయిలు అదీ పంపరట. మనకి జ్ఞాపకం ఉండి, వెనక్కి వెళ్ళి చూసుకొంటూ ఉంటే ఇలా సడన్ సర్పైజులు తగిలే అవకాశం ఉంటుంది. ఏమంటారు? 
 
© Dantuluri Kishore Varma 

6 comments:

  1. అభినందనలు. ఈ టపా రాసిన విధానం బాగుంది. మీ రచనా శైలి బావుంటుంది. :)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శిశిరగారు. చిన్న అనుమానం. మీరు చెప్పింది ఈ టపా గురించా లేక First showers, fresh flowers and many more! గురించా

      Delete
  2. sir,
    Namaste. Mee Blog chadvani roju ledu. Evala Bramharshi Chaganti varu kakinada kamaraju gari gurinchi prastavana techaru. tamaru veelate aa raju gari pai vipulamga vivarinchagalaru
    a.v. ramana
    9441426555

    ReplyDelete
    Replies
    1. చాలా సంతోషం రమణగారు. మీరు చెప్పిన కామరాజు గారి గురించి నాకు తెలియదు. ఈ రోజు చాగంటివారి ఉపన్యాసం కూడా వినలేదు. కానీ, వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. అందితే, మీకు తప్పనిసరిగా తెలియజేస్తాను. దన్యవాదాలు.

      Delete
  3. Replies
    1. చాలా థాంక్స్ మూర్తిగారు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!