Photo Courtesy: Vazeer Ishaan |
శివుడికి, విష్ణుమూర్తికీ ప్రీతిపాత్రమైన కార్తీక మాసం దీపాల వెలుగులతో నిండిపోతుంది.
అన్నవరం సత్యన్నారాయణస్వామి, అంతర్వేది లక్ష్మీ నరశింహస్వామి...
సామర్లకోటలో, ద్రాక్షారామంలో భీమేశ్వరుడు పండుగశోభతో కళకళలాడుతున్నారు
కోనేర్లు, కాలువలు, గోదావరిల్లో తేలియాడుతున్న వేలదీపాలు కాంతులీనుతున్నాయి
మాలధారణచేసే అయ్యప్ప భక్తులకీ ఇదే ఇష్టమైన సమయమేమో
మణికంఠుడి దేవాలయాలు `స్వామియే శరణం అయ్యప్పా!` అని మారుమ్రోగుతున్నాయి.
వారాంతాల్లో తోటలు, గరువులు, బీచ్‌లూ వనభోజనాలతో అందగిస్తున్నాయి
ఇళ్ళూ గుళ్ళూ వేలదీపాల వెలుగుల్లో తడిసి ముద్దవుతున్నాయి
పండుగ శోభ దీపకాంతిలా దశదిశలా వ్యాపించింది.
The Hindu`s Photo |
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment