`వ్యాయామం శరీరానికి ఎలాగో, పుస్తకాలు చదవడం మెదడుకి అలాగ,` అంటారు. నిశ్సబ్ధంగా కూర్చొని చక్కని పుస్తకం చదువుతూ ఉంటే సమయం తెలియదు. ద్యానం చేసుకొన్నప్పటి ఏకాగ్రతలాంటిది కలుగుతుంది. మెదడుమీద వొత్తిడి తగ్గుతుంది. రచయిత మనుష్యులని, ప్రదేశాలనీ వర్ణించి చెపుతుంటే మెదడులో న్యూరాన్లు కొత్త, కొత్త బొమ్మలను సృష్టిస్తాయి. సన్నివేశాల కల్పనచేస్తుంటే నిజమా అన్నంత స్పష్టంగా ఊహాలోకంలో కనిపిస్తుంది. ఒక మహానుభావుడు అత్యంత ప్రభావవంతమైన జీవితాన్ని గడిపితే అతని ఆత్మకథ చదవడం వల్ల ఆ జీవితాన్ని మనం జీవించినట్టే ఎన్నో లైఫ్‌స్కిల్‌ని నేర్చుకోవచ్చు. - చలో లైబ్రరీ! (Read the article here)
జిల్లాకేంద్ర గ్రంధాలయాన్ని 1952లో ప్రారంభించారు. కాకినాడ మెయిన్‌రోడ్‌లో ఉంది. పెద్దభవనం, విశాలమైన రీడింగ్‌రూంలు, మంచి ఫర్నీచర్, వివిధ సబ్జెక్టమీద 83,000 గ్రంధాలతో(లిస్ట్‌కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి) పుస్తకప్రియులని చేతులు చాచి ఆహ్వానిస్తుంది. 72 రకాల పత్రికలని తెప్పిస్తున్నారు. పోటీపరీక్షలకి వెళ్ళే విద్యార్ధులకి అవసరమైన వివిధరకాల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. అంతే కాకుండా గంటకి కేవలం పదిరూపాయలు చెల్లించి అంతర్జాలాన్ని ఉపయోగించుకోగల సదుపాయంతో ఇంటర్నెట్ విభాగాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
మెయిన్‌రోడ్‌నుంచి దూరంగా ఉండే పాఠకులకికూడా చేరువగా ఉండేలా గాంధీనగర్, శ్రీనగర్, రామకృష్ణారావుపేటల్లో ఒక్కొక్కటీ, జగన్నాథపురంలో రెండూ శాఖా గ్రంధాలయాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా చూసుకొంటే - 97 శాఖా గ్రంధాలయాలు, 45 గ్రామీణ గ్రంధాలయాలు, 161 పుస్తక నిక్షిప్తకేంద్రాలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి పదమూడు లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకూ తెరిచి ఉంటుంది. పుస్తకవిభాగం మాత్రం ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ, తిరిగి సాయంత్రం 4 నుంచి 7 గంటలవరకూ తెరిచి ఉంటుంది. ప్రతీ శుక్రవారం శెలవు.
ఇంత పెద్ద గ్రంధాలయాన్ని మనకి దగ్గరలోనే పెట్టుకొని, ఉపయోగించుకోలేక పోవడం బాధాకరమైన విషయం. ముఖ్యంగా విద్యార్థులు రోజుకి కనీసం ఒక గంటసమయమైనా లైబ్రరీల్లో గడిపే అలవాటుని పెంపొందించుకోవాలి. అలా వీలుకాని పక్షంలో వారానికి ఒకటి, రెండు సార్లయినా గ్రంధాలయానికి వెళ్ళాలి.
© Dantuluri Kishore Varma
memu Kakinada lo engineering chaduvukune rojulalo (1958-63) ee library masjeed jaunction sameepaana magistrate court laku eduru bhavanam lo undedi . aa building ne ( building paina kappuki telugulu OM ane aksharalu undevi )deenine ippudu renovate chesaaru kaaabolu . appatlo akkada bhavan's journal, illustrated weekly , reader's digest chaduvukune vaallam --
ReplyDeletevoleti venkata subbarao
ఇది రెనోవేట్ చేసినది కాదు అప్పారావుగారు. ఇలానే నిర్మించారు. మీరు చెప్పినది బహుశా ఓం బిల్డింగ్ అయివుండవచ్చు. ఇది ఇంకా అలానే ఉంది. ఆర్యసమాజం మొదలైనవాటికి సంబంధిచిన చరిత్ర ఏదో ఆ భవనానికి ఉంది. వీలును బట్టి మరొకసారి ఎప్పుడో ఆ విశేషాలు గురించి చెప్పుకొందాం.
Delete