భగవధ్గీత భక్తియోగంలో భక్తునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో చెప్పబడ్డాయి. పదమూడవ శ్లోకంనుంచి పంతొమ్మిదవ శ్లోకంవరకూ దండలో గుచ్చిన పువ్వుల్లాగ ఈ గుణాలనన్నింటినీ కూర్చడం జరిగింది. ప్రతీ లక్షణమూ ఒక పొడి మాటగా ఉంటుంది తప్పించి, దానికి సంబంధించిన వివరణ ఉండదు. కాబట్టే అరబిందోఘోష్, బాలగంగాధర్ తిలక్, స్వామీ వివేకానంద, మహత్మాగాంధీ, ఎడ్విన్ ఆర్నాల్డ్, విద్యాప్రకాశానందగిరి స్వామి లాంటి ఎందరో తమతమ దృక్కోణాలనుంచి అర్థంచేసుకొని భగవధ్గీతకి వివరణ రాశారు. సంస్కృతం అర్థంచేసుకోలేని నాలాంటి వారికి ఇవి చక్కగా మార్గనిర్దేశం చేస్తాయి.
మళ్ళీ గీతలో ఈ అధ్యాయంలో చెప్పిన భక్తుని లక్షణాల దగ్గరకి వస్తే - వాటిని నాలుగు వర్గాలుగా విభజించ వచ్చు అనిపించింది.
1. ప్రకృతితో, మనచుట్టూ ఉన్న జీవజాలంతో ఎలా ఉండాలి?
2. సమాజంలో మిగిలిన వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలి?
3. సమర్ధత కలిగిఉండటానికి కావలసిన లక్షణాలుఏమిటి?
4. జరిగే సంఘటనలకి మనం ఎలా ప్రతిస్పందించాలి, లేదా వాటిని ఎలా స్వీకరించాలి? (దీనినే దృక్పదం అనవచ్చు).
మళ్ళీ గీతలో ఈ అధ్యాయంలో చెప్పిన భక్తుని లక్షణాల దగ్గరకి వస్తే - వాటిని నాలుగు వర్గాలుగా విభజించ వచ్చు అనిపించింది.
1. ప్రకృతితో, మనచుట్టూ ఉన్న జీవజాలంతో ఎలా ఉండాలి?
2. సమాజంలో మిగిలిన వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలి?
3. సమర్ధత కలిగిఉండటానికి కావలసిన లక్షణాలుఏమిటి?
4. జరిగే సంఘటనలకి మనం ఎలా ప్రతిస్పందించాలి, లేదా వాటిని ఎలా స్వీకరించాలి? (దీనినే దృక్పదం అనవచ్చు).
1. ప్రకృతితో, మనచుట్టూ ఉన్న జీవజాలంతో ఎలా ఉండాలి? :
1. ఏ ప్రాణి మీదా, ప్రకృతిమీదా ద్వేషం ఉండకూడదు. విచక్షణా రహితంగా వాటికి హానికలిగించకూడదు.
2. కరుణ కలిగి ఉండాలి.
2. సమాజంలో మిగిలిన వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలి? :
1. అందరితో స్నేహపాత్రులుగా ఉండాలి.
2. ఓర్పు కలిగి ఉండాలి.
3. ఇతరులను భయపెట్టకూడదు, వారి గురించి భయపడ కూడదు.
4. ఎవరినీ ద్వేషించకూడదు.
5. అహంకారం ఉండకూడదు.
6. నిస్పక్షపాతంగా ఉండాలి.
3. సమర్ధత కలిగిఉండటానికి కావలసిన లక్షణాలుఏమిటి? :
1. మనోనిగ్రహం ఉండాలి.
2. దృఢనిశ్చయం కలిగి ఉండాలి.
3. కర్తవ్యాన్ని నిర్వహించగల సామర్ద్యం కలిగి ఉండాలి.
4. సుచీ, శుభ్రం ఉండాలి
5. నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.
6. ప్రతీదానికీ ఆందోళన పడకూడదు.
4. మనదృక్పదం ఎలా ఉండాలి? :
మిగిలిన లక్షణాలనన్నింటినీ ఒక చిట్టాగా ఇవ్వడంలేదు. కానీ వాటి సారాంశం ఏమిటంటే - సుఖం ఉన్నప్పుడు పొంగిపోవడం, కష్టం కలిగినప్పుడు కృంగిపోవడం ఉండకూడదు. దొరికిన దానితో సంతుష్టి పడాలి. దేనిమీదా మమకారం ఉండకూడదు. హర్షము, క్రోదము, భయము ఉండకూడదు. ఇంకొకరకంగా చెప్పాలంటే స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి. కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యం, అప్పులు ఎన్ని ఉన్నా నల్లమబ్బు చుట్టూ వెండి అంచు ఉన్నట్టు ఆనందాలు ఉంటాయి. వాటిని ఆనందిస్తాం, వాటికోసమే బ్రతుకుతాం. కానీ రాత్రి వచ్చిందని కృంగిపోకుండాఉంటే, మళ్ళీ వెలుతురు వస్తుంది కదా? ఈ రకమైన దృక్పదాన్ని అలవాటు చేసుకోమనే గీత చెపుతుంది.
ఈ లక్షణాలు కలిగి ఉన్నవాడు నాకు ప్రియమైన వాడు అని భగవంతుడు చెపుతాడు. అంటే, మంచి భక్తుడైన వాడు ఆదర్శవంతమైన వ్యక్తిగా ఉంటాడు. భక్తి అనేది ఆధ్యాత్మికమైన విషయం. దీనికి లౌకికమైన విషయాలకీ మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. నాస్తికుడైన వాడు కూడా మంచి వ్యక్తిగానే ఉండాలని కోరుకోవచ్చు. అప్పుడు భగవధ్గీతని ఒక పెర్సనాలిటీ డెవలప్‌మెంట్ బుక్‌లా స్వీకరించవచ్చు. చిత్రమైన విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా మిలియన్లకొద్దీ కాపీలు అమ్ముడుపోయే పాపులర్ సెల్ఫ్‌హెల్ప్ బుక్స్ అన్నీ కూడా వీటిలో ఎదో ఒక లక్షణం మీద, లేకపోతే కొన్ని వాటిమీద కలిపి, వాటిని ఎలా పెంపొందించుకోవాలో నేర్పించేవే. ఉదాహరణకి హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇంఫ్లూయన్స్ పీపుల్, హౌ టూ స్టాప్ వర్రీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్, యువర్ ఎర్రోనియస్ జోన్స్, యూ కెన్ విన్, విజయానికి ఐదు మెట్లు మొదలైనవి.
గీతను చదివి మునీశ్వరుడిలా మారిపోవలసిన పనిలేదు. కానీ, దానిని దారిని చూపించే ఒక దీపంలా ఉపయోగించుకొని చెడుని వదిలించుకొని, మంచిని పెంపొందించుకోవాలి. ప్రభావవంతమైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించాలి. అదే భక్తి!
© Dantuluri Kishore Varma
kishor gaariki
ReplyDeletemee blog drusyakaarulu laksha daatinanduku shubhaakaankshalu. meeru chaalaa veera krushi chestaaru. bhaashaa,vishayamu baaguntaayi. meeru tappaka koteeswarulavutaaru
ధన్యవాదాలు జ్ఞాన ప్రసూన గారు. ఇంతవీర కృషిచేస్తేనే లక్షాధికారి కావడానికి సంవత్సరంన్నర పట్టింది. ఇదే రేంజ్‌లో పేజ్‌వ్యూస్ వస్తే కోటిశ్వరుడ్ని కావడానికి రెండుజీవితకాలాలు సరిపోవేమో!
Deleteమహాసముద్రం లాంటి భగవద్గీతలో మంచి ముత్యాలను ఏరుకొని మాకు కూడా అందించినందుకు ధన్యవాదములు.
ReplyDeleteసురేష్ బాబు గారు మీ అభినందనలకి ధన్యవాదాలు.
Deleteచాలా చక్కని విషయంపై పోస్ట్ అందించారు కిషోర్ గారు. ధన్యవాదములు .
ReplyDeleteధన్యవాదాలు వనజగారు.
Deleteమీ బ్లాగ్ ముఖచిత్రం చాలా బావుంది . పదిహేనేళ్ళ క్రితం అచ్చు ఇలాంటి ఇల్లు,వాతావరణంలోనే ఉండేవారిమి. ఇప్పుడు నగర జీవనం క్షణం తీరిక లేకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ చిత్రం చూడగానే చాలా ప్రశాంతత కల్గిందండి. ధన్యవాదములు
ReplyDeleteపచ్చని ప్రకృతి మధ్యలో కొంతకాలమైనా ఉన్నందుకు మీరు అదృష్టవంతులు. ఈ ఫోటో మిమ్మల్ని జ్ఞాపకాలదారుల్లోకి పరుగెత్తించిందన్న మాట!
Deleteచాలా మంచి వివరణ వర్మ గారు. మత/దైవ పరమైన విషయాలు పక్కన పెదితె భగవద్గీత అత్యుత్తమ వ్యక్తిత్వ వికాస సాధనం. ఇది అందరు గ్రహించవలసిన విషయం.
ReplyDeleteమీ వ్యాసం లోని నాలుగు భాగల కింద అద్బుతంగా రాసారు. సంతొ్షం.
మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది గణేష్‌గారూ. భగవధ్గీత వ్యక్తిత్వనిర్మాణానికి ఉపకరిస్తుందని మీరు చెప్పిన మాట అక్షరాలా నిజం.
Deleteముందుగ మీకు చాలా ధన్యవాదములు. చాలా చక్కగా వివరించారు.
ReplyDeleteఆదిత్యవర్మ గారు అభినందనలకి చాలా థాంక్స్.
Deleteభగవద్గీత లోని కొన్ని అంశాలు సార్వకాలికమైనవి...!వివేకానందస్వామి ఒకసారి అంటారు.."మన శాస్త్రాలకు ఎక్కువగా భాష్యం చెప్పిన వారు బలహీనులు...కాబట్టి అదే దృక్పధాన్ని వారు పోషించారు.నిజానికి గీత నుండి విజయ సూత్రాలన్నీ పాశ్చ్యాత్యులు స్వీకరిస్తే క్రీస్తు చెప్పిన శాంతి మార్గాన్ని మనం పాటిస్తున్నాము." Very thoughtful post Varma garu.
ReplyDeleteధన్యవాదాలు మూర్తి గారు.
Delete