ప్రేమ చినుకులా మొదలౌతుంది. సమయం గడుస్తున్నకొద్దీ, చినికూ చినుకూ కలిసి కుంభవృష్ఠయ్యి, ఉప్పెనలా గుండెల్ని ముంచెత్తుతుంది. ప్రేమకి స్పందించి ప్రేయసి వస్తే జీవితం మొదలౌతుంది. రాకపోతే తుదలౌతుంది. చిన్న చిన్న మాటల్లో వేటూరి సుందర్రామ్మూర్తి ప్రేమబాధని ఎలా దట్టించారో చూడండి. `కన్నీటి ముడుపవ్వడం`, `కన్నీటిలో తేనెకలవడం` లాంటి ప్రయోగాలు చూడండి ఎంతబాగుంటాయో. ప్రతీపదం అర్ధవంతంగానే ఉంటుంది.
పాటభావానికి సరిపడేలాంటి చిత్రీకరణ, మణిరత్నం దర్శకత్వప్రతిభ ఈ పాటని అజరామరం చేశాయి. అల్లకల్లోలంగా ఉన్న సముద్రం, మేఘాలుపట్టి వర్షం కురుస్తున్న సాయంత్రం ప్రేయసీ, ప్రియుల మానసిక అలజడిని సూచిస్తాయి. మనీషా కొయిరాలా, అరవిందస్వామిదగ్గరకి పరిగెత్తుకొని వెళ్ళేటప్పుడు ఆమె వేసుకొన్న బురకా ఇనుపకొక్కేనికి తగులుకొంటుంది. ఆమె విడిపించుకోవడానికి ప్రయత్నించి, సాధ్యంకాక వదిలేసి వెళ్ళిపోతుంది. మతాల సరిహద్దులు దాటి వెళ్ళిందని దర్శకుడు చక్కగా చూపించాడు. కదా? ప్రేయసీ, ప్రియులు ఒకచోటకి చేరినప్పుడు కెమేరా వాళ్ళచుట్టూ సర్క్యులర్గా తిరుగుతూ మూడ్‌ని ఎలివేట్ చేస్తుంది. అలాగే చిట్టచివర తిరగడం ఆగిపోయి స్థిరంగా నిలుస్తుంది. హ్యాట్సాఫ్ టు డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్.
ఇవన్ని కలిసి రూపంలాంటివి అయితే, రహమాన్ సంగీతం ఈ పాటకి ప్రాణం. 1995 వచ్చిన బొంబాయి సినిమాలో `ఉరికే చిలుకా` పాట చూడండి.మీకేతెలుస్తుంది.
ఉరికే చిలకా వేచివుంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావెఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు
ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
నీ రాక కోసం తొలిప్రాణమైన దాచింది నా వలపే
మనసంటి మగువ ఏ జాము రాక చితిమంటలే రేపే
నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అది కాదు నా వేదన
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగి పోయేనులే
మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి
కలకై ఇలకై ఊయలూగింది కంటపడి
కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు
ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా
నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయెనే
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా నీ వేణుగానానికే
అరెరే.. అరెరే.. నేడు కన్నీట తేనె కలిసే
ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
మొహమో మైకమో రెండు మనసుల్లో విరిసినది
పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినది
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి
© Dantuluri Kishore Varma
అందమైన పాట. గొప్ప సాహిత్యం,
ReplyDeleteమీ ప్రయత్నం చాలా బాగుంది వర్మాజి.
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు :)
Deleteచాల గొప్ప అభిరుచి. ద్నవాదాలు. మీనుచి ఇంక మంచి పోస్టింగ్స్ ఆసిస్తో ...
Deleteమీ అప్పారావు.
ధన్యవాదాలు అప్పారవుగారు.
Delete