Pages

Sunday, 10 November 2013

కొమ్మకొమ్మకో సన్నాయి

ఆడియో కేసెట్లలో ఇష్టమైన పాటలన్నీ రికార్డ్ చేయించుకొని, మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకొని విన్నరోజులు గుర్తుకొస్తాయి ఈ పాట వింటుంటే. సాహిత్యాన్ని కబళించని శ్రావ్యమైన మామ కే.వీ.మహదేవన్ సంగీతం, దానికి ధీటురాగల వేటురి సుందరరామ్మూర్తి సాహిత్యం. (ఇక్కడొక చిన్న చమత్కారమైన విషయం చెప్పాలి. పాట అంతా రాసిన వేటూరి సుందరరామమూర్తిగారు రికార్డింగ్ సమయంలో తిరుపతి వెళ్ళడంతో ఒకటి రెండు లైన్లని కొంచం మార్పించి ఆచార్య ఆత్రేయగారితో రాయించారట. ఆయన రాసిన ముక్క ఇదే - కొంటే వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు - వేటూరిగారు తిరిగి వచ్చిన తరువాత ఈ పాట పూరింపులో కొంత దోషం ఉందని తప్పుపట్టారట). ఈ రెండింటిలో ఏదిబంగారమో, ఏది దానికి అంటుకొన్న పరిమళమో చెప్పడం కష్టం. దాసరి నారాయణ రావు చిత్రీకరణ కూడా ఎంతో హుందాగా ఉంటుంది. హీరో, హీరోయిన్ల దృక్పదాల్లో ఉన్న వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంది ఈ పాటలో. ఆమెది ప్రేమ, దానిద్వారా కోరుకొంటున్న పెళ్ళీ అనే బంధం. అతనిది బాధాకరమైన గతం, అనిశ్ఛితి కలిగిన భవిష్యత్తు.  అందుకే ఆమె పరుచుకున్న మమతలు చూడు అంటే, అతను ముసురుకున్న మబ్బులు చూడమంటాడు. సుశీల, బాలసుభ్రహ్మణ్యాల గళాల్లో మాధుర్యం బహుచక్కగా ఉంటుంది. ముఖ్యంగా `ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి` అనే పంక్తి దగ్గర చాలా బాగుంటుంది. ఆ ఒక్కలైను కోసమే ఆ పాటని ఎన్నో సార్లు వింటాను. యువచిత్రా బ్యానర్లో వచ్చిన అన్నిసినిమా పాటలూ, కే.వీ.మహదేవన్ సంగీతంలో మెలోడియస్‌గా ఉంటాయి. హ్యాపీ లిజనింగ్!

కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసులో ధ్యానం మాటలో మౌనం

మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పసితనాల తొలి వేకువలో ముసురుకున్న మబ్బులు చూడు
అందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మకొమ్మకో సన్నాయీ...

కొంటే వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
కొంటే వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు
వురకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి వుండాలి
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి వుండాలి
ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి
అందుకే ధ్యానం అందుకే మౌనం
అందుకే ధ్యానం అందుకే మౌనం

కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
మనసులో ధ్యానం మాటలో మౌనం
కొమ్మకొమ్మకో సన్నాయి...

© Dantuluri Kishore Varma

8 comments:

  1. Very Good Narration ....

    ReplyDelete
  2. మంచి పాట. ఈ మధ్యే టివిలో మళ్ళీ చూసా ఈ సినిమాని.
    నాకు మహదేవన్ సంగీతం అంటే చాలా చాలా ఇష్టం.

    ReplyDelete
    Replies
    1. మహదేవన్ గారి పాటల కలెక్షన్ చాలా ఆడియో కేసెట్ల రూపంలో ఉండేది నా దగ్గర బోనగిరిగారు. ఇప్పుడు నెట్లో అవి చాలా మటుకు అందుబాటులో ఉన్నా, కేసెట్‌లో విన్న విధంగా కుదురుగా కూర్చొని వినలేకపోతున్నాం.

      Delete
    2. ధన్యవాదాలు జితేంద్రగారు.

      Delete
  3. కొంటే వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు
    ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
    కొంటే వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు
    వురకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
    ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి వుండాలి
    ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి వుండాలి
    ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి....ఎంత లోతైన భావాలు...ఆ పదాల అల్లిక ఇంకా అమోఘం...అద్భుతః.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్రీవల్లిగారు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!