Pages

Wednesday 27 November 2013

తానాన..తనా..ననాన

స్వామికి నలుగురు ఫ్రెండ్స్.

సోము క్లాసుకంతటికీ అంకుల్ లాంటి వాడు. క్లాస్ లీడర్. వాడిగురించి విద్యార్థులందరూ ఏమనుకొంటారంటే, `వాడిని తిట్టాలంటే కేవలం ప్రినిపాల్ మాత్రమే తిట్టగలడని`. రెండవవాడు మణి. ప్రతీక్లాసునీ రెండుమూడు సార్లు చదివినవాడు. స్కూల్లో ఉన్న ముసలిప్యూన్‌కి జ్ఞాపకం ఉన్నప్పటినుంచీ వాడు స్కూలుకి వస్తూనే ఉన్నాడు. బలంగా, ఎత్తుగా ఉంటాడు. పుస్తకాలు ఏమీ తీసుకురాడు, హోంవర్కులు చెయ్యడు. వాడిదగ్గర రెండు దుడ్డుకర్రలు ఉన్నాయని చెపుతాడు. అవసరం అయితే ఒకటి తీసుకొని వస్తాడు - వాడికి ఎదురుచెప్పినవాళ్ళ నడ్డి విరగ్గొట్టడానికి. అలాంటి వాడిని స్వామి వీపుమీదచరచీ, `ఏరా, ఒరేయ్` అని మాట్లాడెయ్యగలడు! మూడవదాడు శంకర్. సూపర్ తెలివితేటలు ఉన్నవాడు. ఏ లెక్కయినా అయిదునిమిషాలలో చెయ్యగలడు. శంకర్‌గానీ మాస్టర్లని ప్రశ్నలడగడం మొదలు పెడితే, వాళ్ళు సమాధానం చెప్పలేరని కొంతమంది అనుకొంటారు. వాడంటే పడని వాళ్ళూ మాస్టర్ల ఇళ్ళల్లో బట్టలు ఉతికి 90% తెచ్చుకొంటాడని అంటారు. ఏదేమయినా వాడు తెలివైనవాడు. కానీ, శంకర్ ముక్కు ఎప్పుడూ కారుతూనే ఉంటుంది. వాడు పొడవైన జుట్టుని జడవేసుకొని, దానిలో పువ్వులు పెట్టుకొని వచ్చినా సరే వాడికేసి ఆరాధనగా చూస్తుంటాడు స్వామి. స్వామికి ఉన్న నాలుగవ ఫ్రెండ్ శామ్యూల్. `బఠాణి` అని పిలుస్తారు అందరూ. తెలివిలేదు, బలంలేదు, చెప్పుకోవడానికి ఏ క్వాలిటీ లేదు వాడి దగ్గర. కానీ, స్వామికి వాడంటే ఎందుకు ఇష్టమంటే - లెక్కల్లంటే స్వామికి ఎంత భయమో, వాడికీ అంతే. మిగిలిన వాళ్ళకి సాధారణంగా కనిపించే విషయాలు, వాళ్ళఇద్దరికీ చచ్చేటంత నవ్వుతెప్పిస్తాయి.   

స్కూలుకి రాజం అనే కొత్తకుర్రాడు రావడంతో స్వామి ప్రపంచంలో మార్పులు వచ్చేస్తాయి. రాజం మంచి బట్టలు వేసుకొంటాడు. స్కూలుకి కారులో వస్తాడు. వాళ్ళ నాన్న పోలీసు సూపరింటెండెంట్. చదువులో శంకరంత తెలివైనవాడు. బలంలో మణికి సరిపోతాడు. అన్నింటికీ మించి మంచి ఇంగ్లీష్ మాట్లాడగలడు. 

స్వామికి, రాజం అంటే గొప్ప. వాడితో ఫ్రెండ్‌షిప్ చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. మణికి వాడంటే మంట. అందరూ స్వామిని రాజంకి తోక అనడంతో గొడవమొదలౌతుంది.
ఇలాంటి ఫ్రెండ్స్ మన అందరికీ ఉండేవారు కదా చిన్నప్పుడు? ఆర్.కే.నారాయణ్ రాసిన స్వామి అండ్ ఫ్రెండ్స్ చదువుతుంటే మనకథ మనం చదువుతున్నట్టు ఉంటుంది. మాల్గుడి అనే ఊరిని సృష్టించి, కథల్ని, నవలల్నీ రాసిన నారాయణ్ మొట్ట మొదటి నవల ఇది. చాలా మటుకు తన చిన్నప్పుడు జరిగిన సంఘటనల్నే కథా సంఘటనలుగా రాశాడు. కథా కాలం స్వాతంత్ర్యానికి పూర్వం. సరయూ నది, రైల్వే స్టేషన్, మార్కెట్, ఇంగ్లీష్ దొర ఫెడెరిక్ లాలీ విగ్రహం, నల్లప్పతోట.. లాంటి ప్రాంతాల్ని సృష్టించి, నిజమా అనిపించేంతగా నమ్మిస్తాడు రచయిత. నారాయణ్ సోదరుడు ప్రఖ్యాత కార్టూనిస్ట్ ఆర్.కే.లక్ష్మణ్ గీసిన బొమ్మలు మన ఊహించుకొన్న మనుష్యులకి, ప్రాంతాలకీ సజీవ రూపం ఇచ్చినట్టు ఉంటాయి.

కన్నడ దర్శకుడు శంకర్‌నాగ్ (ఈయన నటుడు కూడా) దర్శకత్వంలో మాల్గుడి కథల్ని 39 భాగాలుగా చిత్రీకరించి చాలాకాలం క్రితం డిల్లీ దూరదర్శన్ వాళ్ళు ప్రసారం చేశారు. చిత్రీకరణ, నటన, నేపధ్యసంగీతం అద్భుతం. మాల్గుడీ పునసృష్టించారు. కొన్ని ఎపిసోడ్స్‌లో చివర క్రెడిట్స్ వచ్చేటప్పుడు ఫ్లూటు తో కలిసి వినిపించే తానాన..తనా..ననాన అనే హమ్మింగ్ గుర్తుకువస్తుంది అప్పుడు సీరియల్ చూసిన ఎవరికైనా.   

                                                                                       

12 comments:

  1. Kishore Varma Garu - Well written...Very nostalgic...Thanks for reminding us of good long gone (g)olden days.

    ReplyDelete
  2. బాగా గుర్తు చేసారండీ. పన్లో పని మా పాపకి కూడా పరిచయం చేసేసాను స్వామిని. ఇక్కడా రీ షేర్ చేసాను మీ పోస్ట్. https://plus.google.com/u/0/113642474111918967810/posts

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు స్పురితగారు. అనగనగా స్టోరీస్ ఫర్ కిడ్స్ అనే పేజీ ఉంది పైన. అక్కడి కథలు మీ అమ్మాయికి నచ్చుతాయేమో చూడండి.

      Delete
  3. Varma garu, i still read this book atleast once a month or whenever i need to change my mood. It used to be a ritual for me read Swami and his friends during every holidays since college days. Guess what i'm 39 yrs old now my daughter knows that this is my favourite book of all and that am happy mood whenever i read it.

    ReplyDelete
    Replies
    1. There are ardent fans of R.K.Narayana. Not alone you but I too have most of his novels and read and re-read them. His simple style has magic in it. Thanks for your comment.

      Delete
  4. R.K.Narayan's way of story telling is very simple yet lucid in style.Fortunately he answered one of my letters when I was studying my graduation...his autobiography "My dateless Diary" is still my priority of its kind....well written varma garu..!

    ReplyDelete
    Replies
    1. You are really lucky to have got his reply. Small correction `My Dateless Diary` was a personal journal he maintained during his visit to America. His autobiography is `My Days`. Thanks indeed for the appreciation.

      Delete
  5. స్వామీ అండ్ ఫ్రెండ్స్ కథ ఏమిటో చూడాలని ఉందా? అయితే, చూడండి...
    తర్వాతా blank గా ఉంది, వీడియో link miss అయిందా.. లేక post అక్కడికి సమాప్తం ఆ..??

    ReplyDelete
    Replies
    1. వీడియో లింక్ మిస్సయ్యిందండి. మళ్ళీ రీస్టోర్ చేశాను చూడండి.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!